Vande Bharat Train: సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1,680 రూపాయలు,. కాగా, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3,080 రూపాయలు. వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు రాకపోకలు సాగిస్తుంది.

Vande Bharat Train: సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు

Vande Bharat Train

Vande Bharat Train: సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‭ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. శనివారం సికింద్రాబాద్ నూతన రైల్వే భవనానికి శంకుస్థాపన చేయనున్న ఆయన.. అనంతరం ఈ రైలును సికింద్రాబాద్ స్టేషన్లోనే ప్రారంభించనున్నారు. దేశంలో 13వ వందే భారత్ ఎక్స్‭ప్రెస్ అయిన ఈ రైలు ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా?

* నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ నడుస్తున్నాయి.
* సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ రైలులో 12 గంటల ప్రయాణం పడుతుంది.
* అదే వందే భారత్ రైలులో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల్లో చేరుకోవచ్చు.
* దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్.. ఇందులో 8 కోచులు, 530 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది.
* 1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచులు ఉంటాయి.
* ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచులను పెంచే అవకాశం ఉంది.
* శనివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రైలు ప్రారంభం కానుంది.
* ఈనెల 9 నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణికులకు అందుబాటులో వస్తుంది.
* సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1,680 రూపాయలు,. కాగా, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3,080 రూపాయలు.
* తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ 1,625 రూపాయలు. కాగా, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3030 రూపాయలు.
* వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు రాకపోకలు సాగిస్తుంది.