Selfie With Snake: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. పాముతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన యువకుడు… పాము కాటుతో మృతి

తాజాగా ఒక యువకుడు పాముతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ఇటీవల జరిగింది. మణికంఠ రెడ్డి అనే వ్యక్తి స్థానికంగా జ్యూస్ షాప్ నిర్వహిస్తున్నాడు.

Selfie With Snake: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. పాముతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన యువకుడు… పాము కాటుతో మృతి

Selfie With Snake: సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నా కొందరు అప్రమత్తంగా ఉండటం లేదు. ప్రాణాల్ని రిస్క్ చేసైనా సరే క్రేజీ ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Pakistani rupee: భారీగా పతనమైన పాకిస్తాన్ రూపాయి… డాలర్‌కు 259కు పడిపోయిన కరెన్సీ

తాజాగా ఒక యువకుడు పాముతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ఇటీవల జరిగింది. మణికంఠ రెడ్డి అనే వ్యక్తి స్థానికంగా జ్యూస్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతడి షాపు దగ్గరికి పాములు ఆడించుకునే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ పాము కోరలు తీసేశానని, ఆ పాము ప్రమాదకరం కాదని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో మణికంఠ రెడ్డి ఆ పాముతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. పాములు ఆడించుకునే వ్యక్తి అనుమతితో మణికంఠ రెడ్డి, ఆ పామును మెడలో వేసుకుని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అప్పుడా పాము కింద పడింది.

India Women U19: ప్రపంచ కప్‌కు చేరువలో భారత్.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరి టీమిండియా

దీంతో మళ్లీ పామును మెడలో వేసుకుని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాము మణికంఠ రెడ్డి చేతిపై కాటు వేసింది. దీంతో భయం వేసిన మణికంఠ ఆ పాము యజమానిని మరోసారి అడిగాడు. దీనికి అతడు.. ఆ పాము కోరలు అంతకుముందు రోజే పీకేశానని, అందువల్ల అది హానికరం కాదని, కంగారు పడొద్దని హామీ ఇచ్చాడు. అది నిజమే అనుకున్న మణికంఠ రెడ్డి తన పాము కాటుపై వెంటనే స్పందించలేక, ఆలస్యం చేశాడు. అయితే, పాము కాటు తర్వాత అతడి పరిస్థితి విషమించడం చూసిన స్థానికులు అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి చేర్చారు.

అప్పటికే ఆలస్యం కావడంతో అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు కారణమైన పాములుపట్టే వ్యక్తిని అరెస్టు చేశారు.