Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసు.. టీఎస్ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లో సంచలన విషయాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ-2 సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన సీబీఐ కౌంటర్ లో సంచలన విషయాలు వెల్లడించింది.

Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసు.. టీఎస్ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లో సంచలన విషయాలు

Viveka murder

Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ-2 సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన సీబీఐ కౌంటర్ లో సంచలన విషయాలు వెల్లడించింది. వజ్రాల పేరుతో విలువైన రాళ్లను సునీల్ విక్రయించేవాడని, నకిలీ వజ్రాలు తీసుకొచ్చి వివేకాను మోసం చేసేందుకు ప్రయత్నించాడని సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లో పేర్కొంది.

అయితే సునీల్ యాదవ్ ను వైఎస్ వివేకా హెచ్చరించారని.. అప్పటి నుంచే వివేకా అంటే తనకు నచ్చలేదని సునీల్ యాదవ్ చెప్పినట్లు సీబీఐ కౌంటర్ దాఖలులో పేర్కొంది. ఎర్ర గంగిరెడ్డి ద్వారా వివేకాను చంపేందుకు ప్లాన్ చేశారని కౌంటర్ లో వెల్లడించింది. వివేకా హత్యకు రూ. 40కోట్ల డీల్ కుదుర్చున్నారని సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది.

Viveka Murder Approver Dastagiri : వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు

వివేకా హత్య జరిగిన రోజు నిందితులందరూ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని సీబీఐ తెలిపింది. వివేకా మృతి సమాచారం కృష్ణారెడ్డి ద్వారా రాకముందే అవినాశ్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ చెప్పింది. ఘటనా ప్రదేశంలో సాక్ష్యాలను చెరిపేయడంలో అవినాశ్ పాత్ర ఉందని సీబీఐ తెలిపింది.