Telugu States Water Dispute : నీటి వివాదాల పేరిట రాజకీయాలు వద్దన్న సోము

నీటి వివాదాల పేరిట రాజకీయాలు వద్దని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సూచించారు. గత కొన్ని రోజులుగా నీటి విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

Telugu States Water Dispute : నీటి వివాదాల పేరిట రాజకీయాలు వద్దన్న సోము

Water Somu

Somu Veerraju : నీటి వివాదాల పేరిట రాజకీయాలు వద్దని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సూచించారు. గత కొన్ని రోజులుగా నీటి విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 2021, జూలై 19వ తేదీ సోమవారం మీడియాతో మాట్లాడారు. నీటి వనరుల విషయంలో రాజకీయ వివాదంగా మార్చేశారని, నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా జలాలను అక్రమంగా వినియోగించడంతో తెలంగాణ ప్రభుత్వం వివాదాలకు కారణమైందన్నారు.

Read More : అంతరిక్షంలోకి బ్లూ ఆరిజన్ నౌక

జల వనరుల నిపుణుల సూచన మేరకు…రెండు ప్రభుత్వాలు వ్యవహరించాల్సి ఉందని, ఈ క్రమంలో వర్కింగ్ గ్రూప్ ఆన్ వాటర్ ప్రాజెక్టు కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 21వ తేదీన వర్చువల్ సమావేశం నిర్వహిస్తామని, KRMB, GRMBపై కేంద్రం తీసుకొచ్చిన గెజిట్లపై చర్చిస్తామన్నారు. సీఎం జగన్ పోలవరం పర్యటనపై స్పందించారు. ముందుగా పోలవరం ముంపు బాధితులను పరామర్శించాలని, వసతులు కల్పించకుండా..బాధితులను బలవంతంగా తరలిస్తారా ? అంటూ ప్రశ్నించారు.

71 శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యిందని ఆనాడు చెప్పారని, నిధులు ఇవ్వలేదంటూ..వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు వల్లే పోలవరం గ్రామాల్లో ముంపు వచ్చిందని ఆనాడు విమర్శించారని, ప్రస్తుతం ముంపు వచ్చిందని తెలిపారు. దక్షిణ భారతదేశంలో మాత్రమే నీటి వివాదాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నీటి వివాదాల విషయంలో కేంద్రం ఇచ్చిన గెజిట్ కేసీఆర్ కు అనుకూలంగా ఇవ్వాలా ? అని నిలదీశారు. కేసీఆర్ చెప్పే అబద్దాలకు నోరు కట్టేసేలా కేంద్రం గెజిట్ ఇచ్చిందన్నారు. కేసీఆర్ బ్లాక్ మెయిల్ టెండర్స్ కు కేంద్రం బ్రేకులు వేసిందన్నారు.

Read More :Ashadam : గోదారోళ్ళ ఆషాడం సారె అదిరింది..టన్నుచేపలు..10మేకపోతులు..బిందెలకొద్దీ స్వీట్లు