Somuveerraju : ప్రత్యేక హోదాతో తెలంగాణకు సంబంధం లేదు.. అందుకే తొలగించారు-సోమువీర్రాజు

ప్రత్యేక హోదా అంశం ఏపీకి సంబంధించిన అంశం అని, స్పెషల్ స్టేటస్ తో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించిందని..

Somuveerraju : ప్రత్యేక హోదాతో తెలంగాణకు సంబంధం లేదు.. అందుకే తొలగించారు-సోమువీర్రాజు

Somuveerraju

Somuveerraju : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌ మిగిలిపోయిన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్ర‌భుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ కీల‌క నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 17న ఉదయం 11 గంటల‌కు వర్చువల్ గా కమిటీ తొలి భేటీ నిర్వహించనుంది. కాగా, ఈ కమిటీ అజెండాలో పలు అంశాలను ప్రస్తావించారు. అందులో ప్ర‌త్యేక హోదా అంశం కూడా చ‌ర్చిస్తామ‌ని మొద‌ట కేంద్రం ప్ర‌క‌ట‌న చేసింది.

ఇంతలోనే ఎజెండాలో మార్పులు చేసింది కేంద్రం. స‌మావేశ అజెండా నుంచి ప్ర‌త్యేక హోదా అంశాన్ని తొల‌గించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. అధికార పార్టీ నేతలు టీడీపీ, బీజేపీని టార్గెట్ చేశాయి. ప్రత్యేక హోదా అంశం తొలగింపు వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. దీని వెనుక ఎంపీ జీవీఎల్ ప్రమేయం కూడా ఉందంటూ బీజేపీపైనా విమ‌ర్శ‌లు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు స్పందించారు.

ప్రత్యేక హోదా అంశం ఏపీకి సంబంధించిన అంశం అని, స్పెషల్ స్టేటస్ తో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించిందని సోమువీర్రాజు వివరణ ఇచ్చారు.

కళ్లకు మేలు చేసే ఆహారాలు ఇవే..!

”ప్ర‌త్యేక హోదా అంశం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించిన అంశం. కానీ, 17వ తేదీన ఏర్పాటు చేసే అంశం మ‌న ప్ర‌భుత్వానికి, తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఉన్న ప‌లు అంశాల‌కు సంబంధించిన స‌మావేశం. విద్యుత్ తో పాటు అనేక సంస్థ‌ల్లో ఆస్తుల పంప‌కానికి సంబంధించిన అంశంపై చ‌ర్చిస్తారు. ప్ర‌త్యేక హోదాకు అంశానికి తెలంగాణ‌కు ఎలాంటి సంబంధ‌మూ లేదు. అందులో ప్ర‌త్యేక హోదా అంశం పెట్ట‌కూడ‌దు.

కావాలంటే ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌తిపాద‌న చేస్తే, ఏపీ స‌ర్కారుతో ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేయ‌వ‌చ్చు. అంతేగానీ, తెలంగాణ‌కు ఏం సంబంధం ప్ర‌త్యేక హోదా గురించి. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం పాల్గొంటున్న స‌మావేశంలో ప్ర‌త్యేక హోదా అంశాన్ని ఎలా చ‌ర్చిస్తారు?” అని సోము వీర్రాజు ప్ర‌శ్నించారు. ఏపీ ప్ర‌భుత్వ విధానాలు బాగోలేవ‌ని విమర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ అభివృద్ధికి కృషి చేస్తోంద‌ని చెప్పారు. కాగా, ప్రాజెక్టుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం భూములు ఇవ్వ‌ట్లేద‌ని ఆరోపించారు సోమువీర్రాజు.

Realme C35 Phone : రూ.13 వేలకే రియల్‌మీ కొత్త ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరా..!

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చిందని, అదే విధంగా కాపులకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రస్తావించారని సోమువీర్రాజు తెలిపారు. ఈ ప్రభుత్వానికి ముస్లింలు అంటే ప్రేమ.. కాపులంటే ద్వేషమా? వారికి ఇచ్చినప్పుడు.. కాపులకు ఎందుకు ఇవ్వకూడదు? అని నిలదీశారు.