కళ్లకు మేలు చేసే ఆహారాలు ఇవే!…

బాదం, వాల్నట్స్, జీడిపప్పుల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వయస్సు తో వచ్చే కంటి చూపు మందగమనాన్ని నివారించటంలో తోడ్పడతాయి.

కళ్లకు మేలు చేసే ఆహారాలు ఇవే!…

Eye

మనిషి శరీరంలోని అవయవాల్లో ముఖ్యమైనవి కళ్లు. అందుకే సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. అందుకే కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కంటి చూపు ఉంటేనే అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతాం. కంటి చూపు విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. చూపు పెంచుకునేందుకు సరైన ఆహారం తీసుకోవాలి.

క్యారెట్ ; క్యారట్ లో కళ్లకు కావాల్సిన విటమిన్ ఎ అందుతుంది. ఇందులో ఉండే బీటా కారోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది రెటీనాతో పాటు కంటిలోని వివిధ భాగాలు చురుకుగా పనిచేయటానికి దోహదపడతాయి.

బెండకాయలు ; బెండకాయల్లో బీటా కారోటీన్ ఉంటుంది. ఇందులో ఉండే లుటేయిన్ , జియాగ్జాంథిన్ లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్ సి కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఆప్రికాట్స్; ఆప్రికాట్స్ వీటినే జల్దారుగా పిలుస్తారు. వీటిలో బీటా కారోటీన్ అధిక మోతాదులో ఉంటుంది. ఎదుగుతున్న వయస్సులో ఏర్పడే కంటి సమస్యలను ఇది పరిష్కరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఇ , జింక్, కాపర్, వంటి పోషకాలు ఎంతో మేలు చేస్తాయి.

బ్రోకలీ ; ఇది చూపులకు అచ్చం క్యాలీఫ్లవర్ లా ఉంటుంది. దీనిలో ఉండే యాంటి ఆక్సిడెంట్ లు , లుటేయిన్ లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

గింజలు ; బాదం, వాల్నట్స్, జీడిపప్పుల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వయస్సు తో వచ్చే కంటి చూపు మందగమనాన్ని నివారించటంలో తోడ్పడతాయి.

బొప్పాయి ; ఇందులో ఉండే విటమిన్ సి కళ్లకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ ను అందిస్తుంది. బొప్పాయి తినటం వల్ల కంటికి ఎంతో మేలు కలుగుతుంది.

నారింజ ; నారింజ పండ్లు కళ్ల రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచటంలో దోహదపడతాయి. కంటి వ్యాధుల నుండి కాపాడుతుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు నారింజ రంసం తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. ఇందులో సి విటమిన్ ఎక్కవ మొత్తంలో ఉంటుంది.

చేపలు ; సాల్మన్ చేపలు కంటికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వారానికి ఒకసారి ఆహారంలో బాగం చేసుకోవటం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి రెటీనా కాపాడటంతోపాటు కళ్లు పొడిబారకుండా కాపాడతాయి.