Chandrababu : యువతను ఆకర్షించేందుకు..టీడీపీ కసరత్తు..చంద్రబాబు ప్లాన్ ఏంటీ?

పొలిటికల్ పార్టీ ఎదగాలన్నా.. యూత్ సపోర్ట్ చాలా అవసరం. గత ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీ యువతను ఆకర్షించి పార్టీలో చేర్చుకుని యువ రక్తంతో విజయం సాధించాలని ప్లాన్ వేసింది. దీని కోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

Chandrababu : యువతను ఆకర్షించేందుకు..టీడీపీ కసరత్తు..చంద్రబాబు ప్లాన్ ఏంటీ?

Chandrababu (1)

Nara Chandrababu Naidu : ఎలాంటి పొలిటికల్ పార్టీ ఎదగాలన్నా.. యూత్ సపోర్ట్ చాలా అవసరం. గ్రౌండ్ లెవెల్ నుంచి సోషల్ మీడియా దాకా.. హడావుడి చేయడంలో.. పంచ్‌లు దంచడంలో.. యూత్‌దే కీ రోల్. ఒకప్పుడు.. ఆ పార్టీలో పెత్తనమంతా యువ నాయకులదే. మరి.. ఇప్పుడెందుకు యూత్ ఆ పార్టీకి దూరమయ్యారు.? సీనియర్ లీడర్ల వారసులే.. యూత్ అని పార్టీ నాయకత్వం భావిస్తోందా? యువతను ఆకర్షించేందుకు.. ఆ పార్టీ చేస్తున్న కసరత్తేమిటి?

యువతే పునాదిగా ఎదిగిన తెలుగుదేశం గురించే ఇదంతా. ఎన్టీఆర్ హయాంలో.. యువ నేతలుగా పదవులు అనుభవించిన లీడర్లంతా.. ఇప్పుడు 70ల్లో పడ్డారు. ఏమైందో తెలియదు గానీ.. చాలా కాలంగా యూత్ టీడీపీ వైపు చూడటం లేదు. ఇందుకు.. పార్టీ అధిష్టానం కూడా కొంత కారణమని.. తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. యూత్ అంటే.. సీనియర్ నేతల వారసులే అని అగ్ర నాయకత్వం భావిస్తోందని.. ఇదే.. పార్టీకి నష్టం కలిగిస్తోందని.. కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్.

Also read : Minister Malla reddy : అట్లుంటది ఆయనతోని..మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ..కామెడీగా మారిపోయిందా?

యూత్‌ని.. తెలుగుదేశం వైపు ఆకర్షించేందుకు అధినేత చంద్రబాబు ఎంతో ప్రయత్నించారు. కానీ.. అవేవీ వర్కవుట్ కావడం లేదు. పోనీ.. పార్టీలో ఉన్న యువ నాయకులైనా.. గట్టిగా పనిచేస్తున్నారా? అంటే.. అదీ లేదు. వచ్చే ఎన్నికల్లో.. టికెట్లు దక్కించుకునేందుకు.. యూత్ కోటాలో వారసత్వాన్ని అడ్డుపెట్టుకొని.. లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో.. జరిగింది కూడా ఇదే. తర్వాత.. బొక్క బోర్లా పడ్డారు. అప్పటి నుంచి అడ్రస్ లేకుండా పోయారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా వారసులు ముఖం చాటేస్తున్నారు. అధిష్టానం ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా.. డోంట్ కేర్ అని.. డోర్ క్లోజ్ చేసి పడేస్తున్నారు. కొందరు వారసులు మాత్రమే.. జనంలో వస్తున్న మార్పులను గమనించి.. పార్టీ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని.. తెలుగు తమ్ముళ్లలో చర్చ సాగుతోంది.

టీడీపీ అధికారం కోల్పోయాక.. కొందరు యువ నేతలు వైసీపీలో చేరిపోయారు. ఉన్న కొద్ది మంది.. అప్పుడప్పుడు లోకేశ్ దగ్గర అటెండెన్స్ వేయించుకోవడం తప్ప.. గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నదేమీ లేదని.. కేడర్‌ అసహనం వ్యక్తం చేస్తోంది. దీంతో.. నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ.. అధికార పార్టీపై పోరాటం చేసే వారినే ప్రోత్సహించాలని లోకేశ్ కూడా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో.. వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితేమిటని.. భవిష్యత్తుపై వారసులు బెంగ పెట్టుకున్నారట. ఇద్దరు ముగ్గురు తప్ప.. మిగిలిన యంగ్ లీడర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారని.. పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Also read : AP politics : జనసేనకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న పార్టీలు..దోస్తీ కోసం టీడీపీ, బీజేపీ ప్రయత్నాలు

వచ్చే ఎన్నికల్లో.. యువతకే 40 శాతం సీట్లు కేటాయిస్తామని అధినేత చంద్రబాబు ప్రకటించినా.. యూత్ లీడర్లు పనిచేయడం లేదని.. కేడర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాయలసీమలో.. జేసీ పవన్, జేసీ ఆశ్మిత్, బొజ్జల సుధీర్, భూమా అఖిలప్రియ, గాలి భాను, కేఈ శ్యామ్ బాబు, టీడీ భరత్.. పెద్దగా జనంలోకి వెళ్లడం లేదనే టాక్ వినిపిస్తోంది. పరిటాల శ్రీరామ్.. ఇప్పుడిప్పుడే బయటకొస్తూ.. తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారే చర్చ సాగుతోంది. శ్రీకాకుళంలో.. గౌతు శిరీష అధికార పార్టీపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో అదితి గజపతిరాజు, కిమిడి నాగార్జున, అప్పలనాయుడు, జ్యోతుల నవీన్, కోడెల శివరాం, దేవినేని చందు.. ఇంపాక్ట్ కూడా అంతంతమాత్రమేనని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మరో రెండేళఅలలో ఎన్నికలు రాబోతున్న టైంలో.. యువ ఓటర్లను ఆకర్షించేలా.. పార్టీ వ్యూహాలు రూపొందించుకోవాలని.. తెలుగు తమ్ముళ్ల నుంచే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.