TDP – Janasena : టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ తేదీ, వేదిక ఖరారు
ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ఇరు పార్టీలు ప్రకటించాయి. టీడీపీ-జనసేన కీలక సమావేశానికి.. TDP Janasena Meeting

TDP Janasena Meeting (Photo : Google)
TDP Janasena Meeting : టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ తేదీ ఖరారైంది. ఈ నెల 23న(సోమవారం) రాజమండ్రిలో టీడీపీ-జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నారా లోకేశ్ – పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం కానుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది.
రాజకీయ కార్యక్రమాల స్పీడ్ పెంచేలా..
ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ఇరు పార్టీలు ప్రకటించాయి. టీడీపీ-జనసేన కీలక సమావేశానికి రాజమండ్రి వేదిక కానుంది. చంద్రబాబు జైల్లో ఉన్న రాజమండ్రినే భేటీకి వేదికగా నిర్ణయించాయి ఇరు పార్టీలు. రాజకీయ కార్యక్రమాల స్పీడ్ పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని డెసిషన్ తీసుకున్నారు.
జనసేనతో పొత్తు దిశగా టీడీపీ ముందడుగు..
ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు పొడిచిన సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కాగా, జైల్లో చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చిన వెంటనే.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, పొత్తు దిశగా టీడీపీ ముందడుగు వేసింది. జనసేనతో సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది టీడీపీ.
ఈ కమిటీ సభ్యులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్యను నియమించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు జనసేన పార్టీతో సమన్వయం కోసం కమిటీని నియమించినట్టు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇరు పార్టీల సమన్వయం కోసం ఈ కమిటీ పని చేస్తుందన్నారు.
Also Read : దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం.. చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్
టీడీపీతో సమన్వయం కోసం..
టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేయనుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ఈ రెండు పార్టీల ముఖ్యనేతలు అనౌన్స్ చేసేశారు. టీడీపీతో సమన్వయం కోసం జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే ఓ కమిటీ ప్రకటించారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది.
ఇబ్బందులున్నా కలిసి నడవాలి-పవన్ కల్యాణ్
ఏపీలో జరగబోయే ఎన్నికల్లో కలిసి నడవాలని జనసేన, టీడీపీ ఓ అవగాహనకు వచ్చిన నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు చోట్ల ఇబ్బందులు ఉన్నా కలిసి ముందుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. జనసేన-టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పని చేయాలన్నారు.
Also Read : ప్రభుత్వ వైద్య పరీక్షలు, రిపోర్టులపై నమ్మకం లేదు- చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ లూథ్రా
వచ్చే ఎన్నికల్లో జనసేన విజయభేరి మోగించాలని, ఆ దిశగానే టీడీపీతో కలిసి వెళుతున్నామన్నారు. ఇవాళ తాము సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతికూల సమయాల్లోనే నాయకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుందన్నారు పవన్ కల్యాణ్.