Somireddy : తెలంగాణ కంటే ఏపీకి రూ.33వేల కోట్లు అధికంగా ఆదాయం ఉంది

రెవెన్యూ, అప్పులు కలుకుని ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కంటే రూ.33,054 కోట్లు అధికంగా ఆదాయం ఉందని ఆయన వివరించారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.65,695 కోట్లు మాత్రమే ఉన్న సమయంలో 43 శాతం..

Somireddy : తెలంగాణ కంటే ఏపీకి రూ.33వేల కోట్లు అధికంగా ఆదాయం ఉంది

Somireddy Chandramohan Reddy

Somireddy : ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై రగడ జరుగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తూ ఆందోళన బాట పట్టారు. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. కాగా, కరోనా కారణంగా, విభజన వల్ల రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని, ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. సీఎస్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యున్నత స్థానంలో ఉండి రాష్ట్ర ఆదాయంపై అబద్దాలు ఆడుతున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. సీఎస్ సమీర్ శర్మ.. ప్రభుత్వం ఆడమన్నట్లు ఆడుతూ పేద అరుపులు అరుస్తున్నారని చెప్పారు. రెవెన్యూ, అప్పులు కలుకుని ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కంటే రూ.33,054 కోట్లు అధికంగా ఆదాయం ఉందని ఆయన వివరించారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.65,695 కోట్లు మాత్రమే ఉన్న సమయంలో 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని గుర్తు చేశారు.

Blood Clots : గుండె రక్త నాళాల్లో పూడికలు….ఎవరిలో ఎక్కువంటే?

”2022 నవంబర్ నాటికి రూ.88,618 కోట్లు ఆదాయం వస్తుంది. కాగ్ చెప్పే లెక్కలు ప్రకారం చూసుకున్నా రాబోయే మరో 4 నెలల్లో దాదాపు రూ.44 వేల కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంత ఆదాయం వస్తున్నప్పుడు ఉద్యోగులకు అన్యాయం చేయడం ఏంటి? ప్రజలపై జగన్ రెడ్డి పన్నుల బాదుడే ఇంత ఆదాయానికి కారణం. సుప్రీంకోర్టుకు హాజరవడం బాధనిపించిందని మాట్లాడుతున్న సీఎస్ కు.. ప్రజలపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు గుర్తుకు రావా?

ఏపీలో బాధితులపైనే కేసులు పెడుతున్న సంగతి సీఎస్ కు తెలియదా? పైనాన్స్ సెక్రటరీ రావత్ యావత్తు తప్పుడు లెక్కలు చెబుతూ ఉద్యోగులకు టోపీ పెట్టాలని చూస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఉద్యోగులు రోడ్లపై ఉండటం రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం పంతాలకు పోకుండా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త పీఆర్సీతో తమకు అన్యాయం జరుగుతుందని, జీతాలు తగ్గుతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న వారు.. రేపు సీఎస్ సమీర్ శర్మను కలిసి ముందస్తు సమ్మె నోటీసును ఇవ్వనున్నారు.

Fever : జ్వరంతో బాధపడుతుంటే మాంసాహారం తినకూడదా?

పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలంటూ ఉద్యోగులు ఆందోళనలను ఉధృతం చేస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల ప్రకటించిన పీఆర్సీ ప్రకారమే వేతనాలను చెల్లించేలా అన్ని ట్రెజరీ ఆఫీసులకు ప్రభుత్వం ఉత్తర్వులను పంపించింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగానే జీతాల్లో మార్పులను చేయాలని ఆదేశాలిచ్చింది. ఇటు జీతాల చెల్లింపునకు సీఎఫ్ఎంఎస్ కొత్త సాఫ్ట్ వేర్ నూ సిద్ధం చేసి పెట్టింది.