Pattabhi Release : జైలు నుంచి విడుదలైన పట్టాభి
సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్ పై విడుదలయ్యారు. రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైన పట్టాభి విజయవాడకు బయలుదేరారు.

Pattabhi Release
Pattabhi Release : సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్ పై విడుదలయ్యారు. రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైన పట్టాభి విజయవాడకు బయలుదేరారు. మీడియాతో మాట్లాడేందుకు పట్టాభి నిరాకరించారు. గురువారం నాడు పట్టాభిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
చదవండి : Pattabhi Case : రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి తరలింపు
అనంతరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో తొలుత మచిలీపట్నం జైలుకు తరలించారు. ఇక అటునుంచి అతడిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు అధికారులు. ఇక శనివారం పట్టాభికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.