Sajjala Ramakrishna Reddy : సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా తెలంగాణ అధికారి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న దశరధరామిరెడ్డి నియమితులయ్యారు.

Sajjala Ramakrishna Reddy : సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా తెలంగాణ అధికారి

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న దశరధరామిరెడ్డి నియమితులయ్యారు. అంతర్‌రాష్ట్ర డిప్యూటేషన్‌పై ఏపీకి తీసుకువచ్చి ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు.ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారు.  సజ్జలకు ఓఎస్డీగా నియమించాలని దశరధరామిరెడ్డి ఈ‌ఏడాది జనవరి 20న తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

దశరధరామిరెడ్డి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 11 న తెలంగాణ ప్రభుత్వానికి లేఖరాసింది. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. జూలై 3న అంగీకారం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ కి జులై 3న సమాచారం ఇచ్చింది. రెండు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ రెండేళ్లలో ఆయనకు ఎటువంటి టీఏ, డీఏలు వర్తించవని… ఆయనవిజ్ఞప్తి మేరకే ఈ నియామకం జరిగిందని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.

ఆయన్ను వెంటనే రిలీవ్ చేసి చివరి వేతన చెల్లింపు పత్రంతోపాటు ఆయన సర్వీసు రిజిష్టర్ ను ఏపీ పరిపాలనా శాఖలో సమర్పించాలంటూ తెలంగాణ హోం శాఖను ఉత్తర్వుల్లో ఆదేశించింది. దశరధరామిరెడ్డి డిప్యూటేషన్ ఇప్పుడు బ్యూరోక్రాట్లలో చర్చనీయాంశం అయ్యింది.

సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వంలోషాడో సీఎం గా వ్యవహరిస్తున్నారని అధికార అనధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనే అనేక కార్యక్రమాలు చక్కబెడుతున్నారు. ఆయనకు పనిభారం పెరిగిపోయింది. ఆయన వద్ద పనిచేసేందుకు అత్యంత నమ్మకస్తుడైన అధికారి కోసం ఆయన చూస్తున్నారు.

పలువురు ఐఏఎస్ అధికారులు ఆయన్ను మెప్పించలేకపోయారు. కానీ తెలంగాణ జైళ్లశాఖలో చేసే దశరధరామిరెడ్డి ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా కనిపించారు. దీంతో ఆయన్ను తనకు ఓఎస్డీగా తెచ్చుకుంటున్నారు.