Andhra Pradesh : రాజమండ్రిలో రైతుల పాదయాత్రపైకి చెప్పులు వాటర్‌ బాటిళ్లు విసిరిన వ్యక్తులు..

రాజమండ్రిలో రైతుల పాదయాత్రపైకి చెప్పులు వాటర్‌ బాటిళ్లు విసిరారు కొంతమంది వ్యక్తులు..నల్లబ్యాడ్జీలతో నినాదాలు చేస్తూ.. అమరావతి రైతులపైకి చెప్పులు వాటర్ బాటిళ్లు విసిరారు.

Andhra Pradesh :  రాజమండ్రిలో రైతుల పాదయాత్రపైకి చెప్పులు వాటర్‌ బాటిళ్లు విసిరిన వ్యక్తులు..

Tension in the ongoing farmersPaday

Tension in the ongoing farmers Padayatra : మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతుల పాదయాత్ర రాజమండ్రికి చేరుకుంది. రాజమండ్రిలోని ఆజాద్ చౌక్ వద్దకు చేరుకుంది. ఈ సమయంలో వికేంద్రీకరణ మద్దతుదారులు రైతులపైకి చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరారు. రాజమండ్రిలో పాదయాత్రగా వెళ్తున్న రైతులను రెచ్చగొట్టేలా చెప్పులు, వాటర్‌ బాటిళ్లు విసిరారు. ఆజాద్‌ చౌక్‌ మీదుగా శాంతియుతంగా రైతులు, అఖిలపక్ష నేతలు వెళ్తుండగా నల్లబెలూన్లు ప్రదర్శిస్తూ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు వికేంద్రీకరణ పేరుతో హడావిడి చేస్తున్న వైసీపీ కార్యకర్తలు.. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఇటు అమరావతి రైతులు, అటు వైసీపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు.అమరావతి రైతులకు నిరసనగా నినాదాలు చేశారు. ఒకరిపై మరొక వర్గాల వారు వాటర్ బాటిళ్లు విసురుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్యా వాగ్వాదం.. తోపులాట చోటుచేసుకుంది.

కాగా ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా చూస్తూ ఊరుకున్నారు తప్ప కనీసం ఎవ్వరిని నియంత్రించలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధించటానికి..తమ పాదయాత్ర ఆపివేయటానికి ఇటువంటి పనులు చేయిస్తోంది అంటూ అమరావతి రైతులు ఆరోపించారు. వికేంద్రీకరణ మద్దతుదారుల పేరుతో వైసీపీ నేతలే ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని శాంతియుతంగా తాము పాదయాత్ర చేస్తుంటే ఆటంకాలు సృష్టించి రెచ్చగొట్టే పనులు చేస్తోందని కానీ వారి పాచికలు తమ వద్ద పనిచేయవని ఆకతాయిలు..కుట్రదారులు ఎంత రెచ్చగెట్టినా తాము శాంతియుతంగానే పాదయాత్రను కొనసాగిస్తామని చెబుతున్నారు అమరావతి రైతులు. రైతులకు టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల నేతలు మద్దతు తెలిపారు.వైసీపీ ఇటువంటి ఎన్ని కుట్రలు చేసినా అమరావతే రాజధానిగా కొనసాగుతుందని మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం కాలయాపన కోసం అభివృద్ధి గురించి ప్రశ్నించడాన్ని పక్కదారి పట్టించటానికే ఇటువంటి చర్యలు చేస్తోంది అంటూ విరుచుకుపడ్డారు ప్రతిపక్ష నేతలు.