AP Govt : ఏపీ మంత్రుల పేషీల్లోని అధికారులకు ప్రభుత్వం షాక్

జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగులందరినీ ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపులు చేసింది.

AP Govt : ఏపీ మంత్రుల పేషీల్లోని అధికారులకు ప్రభుత్వం షాక్

Ap Govt

AP government : ఈనెల 11న రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరనుండటంతో ప్రస్తుత మంత్రుల పేషీల్లోని అధికారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారిని మాతృశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న ఓఎస్డీలు, పీఎస్, అదనపు వ్యక్తిగత కార్యదర్శులందరినీ పేరెంట్ డిపార్ట్​మెంట్​లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలిచ్చారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగులందరినీ ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపులు చేసింది. సదరు అధికారి, లేదా ఉద్యోగి.. తిరిగి మంత్రుల వద్దే పని చేయాలని ఆదేశిస్తే మాతృశాఖతో పాటు సదరు మంత్రుల నుంచి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేసినట్టు సమాచారం.

AP Cabinet Reshuffle : ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ.. ఆశావహుల్లో పెరుగుతున్న ఉత్కంఠ

మరోవైపు జిల్లాలకు ఆర్డర్ టూ సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపులు జరిగిన ఉద్యోగుల పదోన్నతులు, శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఇతర సర్వీసు అంశాలపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లనే నోడల్ అధికారులుగా నియమించింది.