AP Cabinet Reshuffle : ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ.. ఆశావహుల్లో పెరుగుతున్న ఉత్కంఠ

విస్తరణకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఇటు మంత్రుల్లో.. అటు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో టెన్షన్ పెరుగుతోంది.

AP Cabinet Reshuffle : ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ.. ఆశావహుల్లో పెరుగుతున్న ఉత్కంఠ

Ap Cabinet (1)

AP Cabinet Reshuffle : ఏపి కేబినెట్ సమావేశం మరికాసేపట్లో జరుగనుంది. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణే లక్ష్యంగా సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై.. సీఎం జగన్‌ మంత్రులకు, పార్టీ నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు. ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేయాల్సి వస్తుంది.. ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఉన్నవారిలో కొందరిని ఎందుకు కొనసాగించాలని అనుకుంటున్నారనే విషయాలను క్యాడర్‌కు చెప్పనున్నారు. కేవలం మంత్రులకు క్లారిటీ ఇవ్వడమే కాదు.. మొత్తం మంత్రివర్గంలోని 24 మంది మంత్రులతో సీఎం జగన్‌ రాజీనామా చేయిస్తారని తెలుస్తోంది.

విస్తరణకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఇటు మంత్రుల్లో.. అటు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో టెన్షన్ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అందరివీ ఊహాగానాలే తప్ప.. అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం రాలేదు. ప్రస్తుతం ఉన్నవారిలో ముగ్గురు లేదా నలుగుర్ని మాత్రమే.. కొత్త కేబినెట్‌లోకి తీసుకుని.. మిగిలినవారందర్నీ తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో ఎవరు మళ్లీ నెక్ట్స్‌ కేబినెట్‌లో ఉండనున్నారు..? ఎవరికి ఉద్వాసన పలుకుతారు.. కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. సీఎం మనసులో ఎవరున్నారో తెలియక అందరిలోనూ టెన్షన్ నెలకొంది.

AP Cabinet Meeting : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణే ప్రధాన ఎజెండా!

అనంతపురం
1. ఉషాశ్రీ చరణ్‌ ( కళ్యాణదుర్గం )
2. జొన్నలగడ్డ పద్మావతి ( శింగనమల )
3. కాపు రామచంద్రారెడ్డి ( రాయదుర్గం )

కర్నూలు
1. శిల్పా చక్రపాణి రెడ్డి (శ్రీశైలం)
2. కాటసాని రాంభూపాల్‌రెడ్డి (పాణ్యం)
3. హఫీజ్ ఖాన్ (కర్నూలు)
4. సాయిప్రసాద్‌ రెడ్డి (ఆదోని)
5. బాలనాగిరెడ్డి (మంత్రాలయం)

కడప జిల్లాలో ఉన్న ఆశావహుల లిస్ట్‌
1.కోరుముట్ల శ్రీనివాసులు ( రైల్వే కోడూరు )
2. శ్రీకాంత్ రెడ్డి ( రాయచోటి )

చిత్తూరు
1. రోజా (నగరి)
2. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (చంద్రగిరి)
3. భూమన కరుణాకర్ రెడ్డి (తిరుపతి)

నెల్లూరు
1. కాకాణి గోవర్ధన్ రెడ్డి ( సర్వేపల్లి )
2. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ( కోవూరు )
3. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( నెల్లూరు రూరల్‌ )
4. కిలివేటి సంజీవయ్య ( సుళ్లూరుపేట )

ప్రకాశం
1. సుధాకర్ బాబు (సంతనూతలపాడు)
2. అన్నా రాంబాబు (గిద్దలూరు)
3. మద్దిశెట్టి వేణుగోపాల్ (దర్శి)

గుంటూరు
1. విడదల రజని (చిలకలూరి పేట)
2. అంబటి రాంబాబు (సత్తెనపల్లి)
3. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల)
4. ఆళ్ల రామకృష్ణా రెడ్డి (మంగళగిరి)
5. మేరుగ నాగార్జున (వేమూరు)

కృష్ణా
1. సామినేని ఉదయభాను ( జగ్గయ్యపేట )
2. మల్లాది విష్ణు ( విజయవాడ సెంట్రల్‌ )
3. కొలుసు పార్థసారథి ( పెనమలూరు )
4. వసంత కృష్ణ ప్రసాద్‌ ( మైలవరం )

AP Cabinet : ఏపీ కేబినెట్‌కు కౌంట్‌డౌన్.. కొత్తమంత్రివర్గంలో ఎవరెవరికి చోటు.. తేలేది నేడే..!

పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రస్తుత కేబినెట్‌లో ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ రంగనాథరాజు ఉన్నారు. కేబినెట్‌ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ జిల్లా నుంచి ఆశావహుల లిస్టు పెద్దదే ఉంది. ఆశావహుల జాబితాలో… తెల్లం బాలరాజు, గ్రంథి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావు, తలారి వెంకట్రావు, అబ్బయ్య చౌదరి ఉన్నారు.

పశ్చిమగోదావరి

1. తెల్లం బాలరాజు (పోలవరం)
2. గ్రంథి శ్రీనివాస్ (భీమవరం)
3. ముదునూరి ప్రసాదరాజు (నర్సాపురం)
4. కారుమూరి నాగేశ్వరరావు (తణుకు)
5. తలారి వెంకట్రావు (గోపాలపురం)
6. అబ్బయ్య చౌదరి (దెందులూరు)

తూర్పుగోదావరి
1. దాడిశెట్టి రాజా (తుని)
2. తోట త్రిమూర్తులు- ఎమ్మెల్సీ (రామచంద్రాపురం)
3. కొండేటి చిట్టిబాబు (పి.గన్నవరం)
4. పొన్నాడ సతీష్‌ (ముమ్మిడివరం)

విశాఖపట్నం
1. కరణం ధర్మశ్రీ ( చోడవరం )
2. గుడివాడ అమర్నాధ్‌ ( అనకాపల్లి )
3. బూడి ముత్యాల నాయుడు (మాడుగుల)
4. గొల్ల బాబూరావు (పాయకరావుపేట)
5. కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి (పాడేరు)
6. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ (ఎమ్మెల్సీ)

AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణ.. మంత్రివర్గంలో ఎవరిని ఉంచుతారు? ఎవరిని తొలగిస్తారు?

విజయనగరం జిల్లా నుంచి ప్రస్తుతం ఇద్దరు నేతలు మంత్రివర్గంలో ఉన్నారు. అందులో ఒకరు బొత్స సత్యనారాయణ, మరొకరు పాముల పుష్ప శ్రీవాణి. బొత్స మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటే.. డిప్యూటీ సీఎంగా, గిరిజన శాఖమంత్రిగా పుష్ప శ్రీవాణి వ్యవహరిస్తున్నారు.అయితే కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లా నుంచి పలువురు మంత్రి పదవులు ఆశిస్తున్నారు
విజయనగరం జిల్లాలో ఉన్న ఆశావహుల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు.. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర. ముందుగా కోలగట్ల వీరభద్రస్వామి గురించి చూద్దాం…

శ్రీకాకుళం
1. తమ్మినేని సీతారాం (ఆముదాలవలస)
2. ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం)
3. కళావతి విశ్వాసరాయి (పాలకొండ)
4. కంబాల జోగులు (రాజాం)
5. రెడ్డి శాంతి (పాతపట్నం)