AP Cabinet Meeting : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణే ప్రధాన ఎజెండా!

విస్తరణకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఇటు మంత్రుల్లో అటు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో టెన్షన్ పెరుగుతోంది.

AP Cabinet Meeting : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణే ప్రధాన ఎజెండా!

Ap Cabinet

AP cabinet meeting : మరికాసేపట్లో ఏపి కేబినెట్ సమావేశం కానుంది. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణే లక్ష్యంగా సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై.. సీఎం జగన్‌ మంత్రులకు, పార్టీ నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు. ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేయాల్సి వస్తుంది.. ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఉన్నవారిలో కొందరిని ఎందుకు కొనసాగించాలని అనుకుంటున్నారనే విషయాలను క్యాడర్‌కు చెప్పనున్నారు. కేవలం మంత్రులకు క్లారిటీ ఇవ్వడమే కాదు.. మొత్తం మంత్రివర్గంలోని 24 మంది మంత్రులతో సీఎం జగన్‌ రాజీనామా చేయిస్తారని తెలుస్తోంది.

విస్తరణకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఇటు మంత్రుల్లో.. అటు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో టెన్షన్ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అందరివీ ఊహాగానాలే తప్ప.. అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం రాలేదు. ప్రస్తుతం ఉన్నవారిలో ముగ్గురు లేదా నలుగుర్ని మాత్రమే.. కొత్త కేబినెట్‌లోకి తీసుకుని.. మిగిలినవారందర్నీ తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో ఎవరు మళ్లీ నెక్ట్స్‌ కేబినెట్‌లో ఉండనున్నారు..? ఎవరికి ఉద్వాసన పలుకుతారు.. కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. సీఎం మనసులో ఎవరున్నారో తెలియక అందరిలోనూ టెన్షన్ నెలకొంది.

AP Cabinet : ఏపీ కేబినెట్‌కు కౌంట్‌డౌన్.. కొత్తమంత్రివర్గంలో ఎవరెవరికి చోటు.. తేలేది నేడే..!

ముఖ్యంగా రాబోయేది ఎన్నికల కాలం.. దీంతో మంత్రివర్గంలోకి తీసుకొనేవారి విషయంలో సీఎం జగన్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల కోసం.. ఇప్పుడే ఎలక్షన్‌ టీమ్‌ను రెడీ చేస్తున్నారు సీఎం జగన్‌. ప్రాంతాలు, జిల్లాలు, కులాల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారికి కేబినెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మిగిలిన సామాజికవర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఉండబోతుందని సమాచారం.

మంత్రుల రాజీనామాల తర్వాత సీఎం జగన్ వారితో విడి విడిగా మాట్లాడనున్నారు. ఎందుకు పదవుల నుంచి తప్పించాల్సి వచ్చింది. వారికి అప్పగించబోయే బాధ్యతలు ఏంటి.? వచ్చే ఎన్నికల కోసం ఎవరు ఏం చేయాలి అన్నదానిపై పూర్తిగా క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక.. కొత్త కేబినెట్‌లో ఎవరెవరికి బెర్త్‌ కేటాయించారనే విషయాన్ని ఒకరోజు ముందుగానే సమాచారం అందించనున్నారు. 11వ తేదీన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ.. అదే రోజు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో.. 10వ తేదీన కొత్తగా మంత్రివర్గంలో స్థానంపొందే వారికి సీఎం సమాచారం ఇవ్వనున్నారు.

AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణ.. మంత్రివర్గంలో ఎవరిని ఉంచుతారు? ఎవరిని తొలగిస్తారు?

ఇక.. ఫస్ట్‌ కేబినెట్‌కు ఇవాళే లాస్ట్‌ డే కానుంది. దాదాపు మూడేళ్లగా.. అమాత్యుల హోదాలో, మంత్రులుగా అధికారం చెలాయించినవారంతా మాజీలుగా మారిపోతున్నారు. పాలనకు ఆయువుపట్టుగా భావించిన వారంతా.. పార్టీ పదవుల్లో చేరుతున్నారు. గౌరవనీయులైన మంత్రులగా ఇవాళే వారికి లాస్ట్ వర్కింగ్ డే కానుంది. క్యాబినెట్ సమావేశం అలా ముగుస్తుందో లేదో.. ఇలా వారు మంత్రి పదవులు కోల్పోబోతున్నారు.