Boy Died : బైక్‌ చక్రంలో చిక్కుకుని బాలుడు మృతి

మరికాసేపట్లోనే ఇంటికి చేరుకుంటారు.. కానీ అదే సమయంలో బైక్ వెనుక కూర్చుకున్న తల్లి ఒడిలో నుంచి బాలుడు ఒక్కసారిగా జారిపోయాడు. రోడ్డుపై పడకుండా బైక్ వెనుక చక్రంలో పడి చుట్టుకుపోయాడు.

Boy Died : బైక్‌ చక్రంలో చిక్కుకుని బాలుడు మృతి

Boy Dead

Updated On : January 23, 2022 / 1:49 PM IST

boy stuck in the bike wheel : కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు అమ్మ ఒడిలో ఉన్న చిన్నారి.. బైక్ వీల్‌లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఎర్రదొడ్డి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల బాలుడిని తీసుకుని అమ్మానాన్న టూ వీలర్‌పై ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని ఇంటికి తిరిగివస్తున్నారు.

మరికాసేపట్లోనే ఇంటికి చేరుకుంటారు.. కానీ అదే సమయంలో బైక్ వెనుక కూర్చుకున్న తల్లి ఒడిలో నుంచి బాలుడు ఒక్కసారిగా జారిపోయాడు. రోడ్డుపై పడకుండా బైక్ వెనుక చక్రంలో పడి చుట్టుకుపోయాడు.. వెంటనే బండి ఆపి చిన్నారిని తీసేందుకు తీవ్రంగా ప్రయత్నారు. అప్పుడికే బాలుడికి తీవ్ర గాయాలయ్యాడు.

TDP-YCP Clash : టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. అమరావతిలో టెన్షన్

వెంటనే మళ్లీ ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది.. బైక్ వీల్‌ మూడు నెలల చిన్నారిని బలితీసేసుకుంది. అప్పటి వరకు తన ఒడిలో ఉన్న బిడ్డ..ఒక్కసారిగా విగత జీవిగా మారిపోడంతో ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. తండ్రి కూడా కుప్పకూలిపోయాడు.