CM Jagan : ముగిసిన సీఎం జగన్ కీలక సమావేశం.. నేతలకు దిశానిర్దేశం

2024 ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. త్వరలో జరగబోయే ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లపై అభిప్రాయాలు...

CM Jagan : ముగిసిన సీఎం జగన్ కీలక సమావేశం.. నేతలకు దిశానిర్దేశం

Ys Jagan

CM Jagan Meeting : పార్టీ నేతలతో సీఎం జగన్ ఏర్పాటు చేసిన కీలక మీటింగ్ కాసేపటి క్రితం ముగిసింది. 2022, ఏప్రిల్ 27వ తేదీ బుధవారం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2024 ఎన్నికలే లక్ష్యంగా.. నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ పథకాల ద్వారా ప్రతింటికి ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో తెలుసుకొనేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం చేసినట్లు తెలుస్తోంది.

Read More  : YCP : ఏపీలోని 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించిన వైసీపీ

సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. 2024 ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. త్వరలో జరగబోయే ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రతి నెల సచివాలయాలు సందర్శించాలని, నెలకు ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే పది సచివాలయాలు తిరగాలని సూచించారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉండాలని చెప్పినట్లు సమాచారం. మే 02వ తేదీ నుంచి జరిగే గడపగడపకు వైసీపీని కచ్చితంగా అమలు చేయాలని, ప్రజా సమ్యలను అన్నీ తెలుసుకోవాలని సూచించారు. 2024 ఎన్నికల్లో నేతల మధ్య విబేధాలు ఉండవద్దని స్పష్టంగా చెప్పినట్లు, త్వరలోనే సీఎం జగన్ జిల్లాల పర్యటన చేయనున్నారని తెలుస్తోంది.