Brahmangari Matam : కొలిక్కి రానున్న బ్రహ్మంగారి మఠాధిపతి వ్యవహారం

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి అకాల మరణంతో మఠాధిపతి స్థానం ఖాళీ ఏర్పడింది. ధార్మిక పరిషత్ కమిటీ సభ్యుల కుదింపుపై హైకోర్టులో పిల్ దాఖలు అయింది.

Brahmangari Matam : కొలిక్కి రానున్న బ్రహ్మంగారి మఠాధిపతి వ్యవహారం

Brahmagaru

Dharmika Parishat Committee : కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మఠాధిపతి వ్యవహారం కొలిక్కి రానుంది. ఈ నెల 5న ధార్మిక పరిషత్ కమిటీ బ్రహ్మంగారిమఠంలో పర్యటించనుంది. వీరబ్రహ్మేంద్రస్వామి సంప్రదాయానికి చెందిన మఠాధిపతులు, శిష్యులతో ధార్మిక పరిషత్ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. వారి నుండి ధార్మిక పరిషత్ కమిటీ సభ్యులు సలహాలు-సూచనలు స్వీకరించనున్నారు.

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి అకాల మరణంతో మఠాధిపతి స్థానం ఖాళీ ఏర్పడింది. వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి మొదటి భార్య పిల్లలు, రెండవ భార్య మారుతి మహాలక్ష్మమ్మ మఠాధిపతి కోసం పోటీపడుతున్నారు. ధార్మిక పరిషత్ కమిటీ సభ్యుల కుదింపుపై హైకోర్టులో పిల్ దాఖలు అయింది.

Car Donate : తిరుమల శ్రీవారికి ఇన్నోవా కారు విరాళం

దేవాదాయ చట్టంలోని సెక్షన్ 152 ప్రకారం 21మంది ఉండాల్సిన ఏపీ ధార్మిక పరిషత్ కమిటీ సభ్యులను 4కి కుదింపు చేయడంపై ఫిల్ దాఖలు చేశారు. చట్ట సవరణ ద్వారా దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్ గా, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్, తిరుమల తిరుపతి కార్యనిర్వహణ అధికారి సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు.

అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసులు.. హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 2021 నవంబర్ 22న ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ ఆధారంగా ముందుకు వెళ్లకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ జరుగనుంది.