Marriage: పెళ్లి పీటలపై కుప్పకూలిన వరుడు.. పెళ్లి కూతురు తల్లిదండ్రులు చేసిన పనికి అంతాషాక్..

మరికొద్దిసేపట్లో పెళ్లి తంతు జరగాల్సి ఉంది. బంధువులతో ఇళ్లు కళకళలాడుతుంది. అందరూ పెళ్లికి తయారవుతున్నారు. ఈ సమయంలో వరుడికి గుండెపోటు రావడం, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతిచెందడం జరిగింది. పెళ్లిభాజాలు మోగాల్సిన ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నీరు పెట్టుకున్నారు..

Marriage: పెళ్లి పీటలపై కుప్పకూలిన వరుడు.. పెళ్లి కూతురు తల్లిదండ్రులు చేసిన పనికి అంతాషాక్..

Ap Crime News

Marriage: మరికొద్దిసేపట్లో పెళ్లి తంతు జరగాల్సి ఉంది. బంధువులతో ఇళ్లు కళకళలాడుతుంది. అందరూ పెళ్లికి తయారవుతున్నారు. ఈ సమయంలో వరుడికి గుండెపోటు రావడం, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతిచెందడం జరిగింది. పెళ్లిభాజాలు మోగాల్సిన ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషాద ఘటన కర్నూల్ జిల్లా పెద్దకడబూరు మండలంలో చోటు చేసుకుంది. పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామానికి చెందిన గౌసియా, చాంద్ బాష దంపతులకు ఇద్దరు కుమారులు. ఒక కూతురు. పెద్ద కుమారుడు అబ్దుల్ అనీఫ్ (23)కు హోళగుంద మండలం గుజ్జహళ్లి గ్రామంలో గత సంవత్సరం పెళ్లి నిశ్చయమయింది. ఈ నెల 21, 22 తేదీల్లో వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు.

AP Crime : ఏపీలో ఎస్ఐ గోపాలకృష్ణ అనుమానాస్ప‌ద మృతి..

వధువు ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉండటంతో వరుడు తరపు బంధువులు 21న సాయంత్రం గజ్జహళ్లి గ్రామం చేరుకున్నారు. రాత్రి పెళ్లికి సంబంధించి జరగాల్సిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే పెళ్లికి వారం ముందు వరుడికి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చూపించారు. వైద్యుడు పరీక్షించి ఎలాంటి సమస్య లేదని తెలిపాడు. మళ్లీ 21వ తేదీ రాత్రి పెళ్లి వేడుకలు అయిన తరువాత వరుడికి గుండెపోటు రావడంతో స్థానిక వైద్యుడికి చూపించి చికిత్స అందించారు. పెళ్లి రోజు 22వ తేదీన ఒకపక్క పెళ్లి పనులు జరుగుతుండగా.. పెళ్లికి గంటముందు మళ్లీ వరుడు అబ్దుల్ అనీఫ్ కు గుండెపోటు వచ్చింది.

AP Crime : 78 సిమ్ కార్డులు మార్చి..వెంటాడి వేధించి కావ్యను కాల్చి చంపిన సురేశ్ రెడ్డి

హుటాహుటీన కుటుంబ సభ్యులు కారులో కర్ణాటక రాష్ట్రం శిరిగుప్పలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడికి వెళ్లేలోపు అనీఫ్ కన్నుమూశాడు. దీంతో రెండు కుటుంబాల్లో విషాద చాయలు అలముకున్నాయి. అయితే పెళ్లి కూతురు తల్లిదండ్రులు, బంధువులు మాత్రం పెళ్లి కార్యక్రమం ఆగకూడదని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా అదే మండలంకు చెందిన ఓ యువకుడికి అదే ముహూర్తానికి ఆ వధువుతో వివాహం చేయించారు. ఒక పక్కన పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లికొడుకు మృతిచెందగా, మరోపక్క వధువుకు వేరే వ్యక్తికి పెళ్లి జరిపించిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.