Anantapur Robbery in Kadiri : టీచర్‌ని హత్యచేసి దోపిడీ చేసిన గ్యాంగ్ ని త్వరలోనే పట్టుకుంటాం: SP ఫకీరప్ప

అనంతపురం జిల్లా కదిరిలో దోపిడి దొంగలు బీభత్సం సష్టించారు. ఓ టీచర్ ని చంపి దోచుకుపోయారు. మరో ఇంటిలో మరో మహిళలపై దాడికి చేసి దోచేశారు.దీంతో పోలీసులు దొంగలకోసం గాలిస్తున్నారు.

Anantapur Robbery in Kadiri : టీచర్‌ని హత్యచేసి దోపిడీ చేసిన గ్యాంగ్ ని త్వరలోనే పట్టుకుంటాం: SP ఫకీరప్ప

Robbery In Anantapur Kadiri City

Robbery in Anantapur Kadiri City : అనంతపురం జిల్లా కదిరిలో దోపిడి దొంగలు బీభత్సం సష్టించారు. ఎన్ జీ ఓ కాలనీలో రెండు ఇళ్లలో మంగళవారం ఉదయం 5,6 గంటల సమయంలో దోపిడికి పాల్పడిన దొంగలు హల్ చల్ చేశారు. ఓ ఇంట్లో చోరీ చేస్తుండగా అడ్డుకున్న మహిళలను ఇనుపరాడ్డుతో కొట్టారు.దీంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. అలాగే మరో మహిళ ఇంట్లో చొరబడిన దొంగలు ఆ ఇంటిలో మరో మహిళపై కూడా దాడి చేసి దోచుకుపోయారు. ఈ దోపిడీలతో కదిరి పట్టణం  ఉలిక్కిపడింది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

కదిరిలో దోపిడీలపై జిల్లా ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతు..ఈ దోపిడీ ఫ్రోఫెనల్ గ్యాంగ్ టీమ్ చేసినట్లు కనబడుతుందని అన్నారు. దోపిడీ చేయటానికి రెక్కీ ఎప్పుడు నిర్వహించారు? ఎంతమంది రెక్కీలో పాల్గొన్నారు? అనేది దానిపై ప్రతిదీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. దోపిడీ గురించి క్లూస్ తెలుసుకోవానికి స్పెషల్ డాగ్స్ టీమ్ క్లూస్ టీమ్ లతో డియస్పీ భవ్య కిషోర్ తనీఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దొంగలను పట్టుకోవటానికి..వారి ఆచూకీ తెలుసుకోవానికి రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్, లాడ్జీలలో జిల్లా వ్యప్తంగా వాహనాలు తనిఖీ చేపట్టామమని తెలిపారు.

Read more : Theft : అనంతలో దొంగల బీభత్సం.. టీచర్‌ని హత్యచేసి దోపిడీ

కదిరి ఏరియాలో అంతర్ రాష్ట్రాల వాళ్లు సంచరిస్తుంటారనీ..ఇతర రాష్టాల నుంచి వచ్చి ఇక్కడ లాడ్జిల్లో ఉండి వెళుతుంటారని అలా వచ్చిన గ్యాంగ్ రెక్కీ చేసిన దోపిడీలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ఆరు టీముల్ని ఏర్పాటు చేశామని..ఒక అడిషనల్ యస్పీ ఐదు మంది యస్ ఐ ల ఆధ్యర్యంలో ఐదు స్పెషల్ టీములు ఏర్పాటు చేశామని తెలిపారు. కదిరి దోపిడీ కేసుని ఒక చాలెంజ్ గా తీసుకొని త్వరత గతిన చేదించి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉష ఇంట్లోకి చొరబడిన దొంగలు దోచుకునే క్రమంలో ఆమె అడ్డుకోవడంతో దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత వారి పక్కింట్లో దోపిడీకి పాల్పడింది దొంగల ముఠా. దీంతో ఆ ఇంట్లో యజమానురాలు శివమ్మ కూడా దొంగల్ని అడ్డుకుంది. దీంతో ఆమెపై కూడా దాడి చేశారు.

Readmore :

కాగా..ఉష అనే ఉపాధ్యాయురాలు భర్త వాకింగ్‌కి వెళ్లటం గమనించిన దొంగలు ముఠా ఇంట్లోకి చొరబడి దోపిడీకి యత్నించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఉషపై దాడి చేసిన దుండగులు హత్యచేసి అందినకాడికి దోచుకెళ్లారు. ఆ తర్వాత శివమ్మ అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దొంగల గ్యాంగ్ ఇంట్లోని మహిళపై దాడి చేసి అక్కడకూడా దోచుకు పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించాగా దొంగల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఉష మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బాడీని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. దొంగల్ని త్వరలోనే పట్టుకుని తీరతామని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.