Thota Chandrasekhar: ఏపీ రాజధాని ఏదంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది.. కేసీఆర్, కేటీఆర్‌లను చూసి నేర్చుకోవాలి

తెలంగాణలో కంపెనీలు క్యూ కడుతున్నాయి. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా కేటీఆర్ పని చేస్తున్నారు. ప్రతిరోజు ఒక కంపెనీ వచ్చేలా కృషి చేస్తున్నారు. ఇక్కడ పనిచేసేది తక్కువ.. ఆర్భాటం ఎక్కువ అంటూ ఏపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ విమర్శలు చేశారు.

Thota Chandrasekhar: ఏపీ రాజధాని ఏదంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది.. కేసీఆర్, కేటీఆర్‌లను చూసి నేర్చుకోవాలి

Thota Chandrasekhar

AP BRS Party Office: ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీలు అధికారం చేపట్టాయి. అయినా, ఏపీ రాజధాని నిర్మించుకోలేక పోయాం. ఏపీ రాజధాని ఏదంటే సిగ్గుతో తలదించుకోవాల్సి‌న పరిస్థితి అంటూ బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ ఏపీ ప్రధాన కార్యాలయాన్ని తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ నుంచి కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి‌లో దూసుకుపోతుంటే ఏపీలో సాగు, తాగునీరు లేదని అన్నారు. అభివృద్ధి లేక ఏపీ కునారిల్లి పోతుందని విమర్శించారు.

AP BRS Office: ప్రారంభానికి సిద్ధమైన ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.. ప్రారంభించేది ఎప్పుడో తెలుసా?

కేంద్రాన్ని ప్రశ్నించే వ్యక్తి కేసీఆర్ ..

విపక్ష పార్టీలను కేంద్రంలోని బీజేపీ అగణదొక్కుతుందని, మత చాంధసంతో దేశాన్ని ముక్కలు చేస్తుందని తోట చంద్రశేఖర్ విమర్శించారు. కర్నాటకలో బీజేపీని ప్రజలు తిరస్కరించారని, తద్వారా దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో లేదని అన్నారు. రాహుల్ నాయకత్వాన్ని దేశం స్వీకరించే పరిస్థితి లేదని, మతతత్వ పార్టీని గద్దె దించాలంటే ఫెడరల్ పార్టీలను ఏకం చేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొడుతుంది ఒక్క కేసీఆర్ మాత్రమేనని, కేంద్రాన్ని ప్రశ్నించే వ్యక్తి కేసీఆర్ అని చంద్రశేఖర్ అన్నారు.

Thota Chandrasekhar : ఏపీలో ఇది బీఆర్ఎస్ తొలి విజయం-తోట చంద్రశేఖర్

కేసీఆర్, కేటీఆర్‌లను చూసి నేర్చుకోవాలి..

ఒకపక్క హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుపోతుంది. ఏపీలో మాత్రం రాజధాని కూడా నిర్మించుకోలేకపోయాం. రాజధాని ఏదంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ విడిపోయాక.. ఏపీలో టీడీపీ, వైసీపీలు అధికారంలోకి వచ్చాయి. కానీ, అభివృద్ధి లేక ఏపీ కునారిల్లి పోతుంది. తెలంగాణ అభివృద్ధి‌లో దూసుకుపోతుంటే.. ఏపీలో నిరుద్యోగం పెరిగి పోయింది. కొత్త పరిశ్రమలు రాలేదు. పెట్టుబడులు లేవు. 13లక్షల కోట్లు దేశంలోకి పెట్టుబడులు వస్తే ఏపీకి వచ్చినవి కేవలం 5700 కోట్లు మాత్రమే. ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.

Thota Chandrasekhar : ఏపీ ప్రజల్లో కేసీఆర్‌పై వ్యతిరేకత లేదు, స్టీల్ ప్లాంట్ టేకోవర్‌కు అవకాశాలు పరిశీలిస్తున్నాం-తోట చంద్రశేఖర్

తెలంగాణలో కంపెనీలు క్యూ కడుతున్నాయి. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా కేటీఆర్ పని చేస్తున్నారు. ప్రతిరోజు ఒక కంపెనీ వచ్చేలా కృషి చేస్తున్నారు. ఇక్కడ పనిచేసేది తక్కువ.. ఆర్భాటం ఎక్కువ అంటూ ఏపీ ప్రభుత్వంపై తోటా చంద్రశేఖర్ విమర్శలు చేశారు. కేంద్రాన్ని మెడలు వచ్చి నిధులు తెచ్చుకునే పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి లేదు, మోడీ‌ని చూసి భయపడుతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదు. రాజధానికి నిధులు ఇవ్వటం లేదు. నరేంద్రమోడీని ఢీ కొడుతుంది ఒక్క కేసీఆర్ మాత్రమే. కేంద్రాన్ని ప్రశ్నించే వ్యక్తి కేసీఆర్. తెలంగాణను చూసి ఏపీ ప్రభుత్వం ఇప్పటికైన మేల్కోవాలంటూ సూచించారు.