Andhra Pradesh : బంధువు అంత్యక్రియలకు వెళ్లి ముగ్గురు మృతి.. పాడె మోస్తుండగా విద్యుత్ షాక్

అంత్యక్రియలు చేసేందుకు ఆమెను పాడెపై గ్రామ శివారులోని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శ్మశానవాటికలో విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయాన్ని గమనించకపోవడంతో పాడెకు విద్యుత్ తీగలు తగిలాయి.

Andhra Pradesh : బంధువు అంత్యక్రియలకు వెళ్లి ముగ్గురు మృతి.. పాడె మోస్తుండగా విద్యుత్ షాక్

electric shock

Updated On : June 18, 2023 / 8:52 AM IST

Electric Shock Three Died : ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. బంధువు అంత్యక్రియలకు వెళ్లిన ముగ్గురు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కుప్పం మండలం తంబిగానిపల్లెకు చెందిన రాణి(65) అనే వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు.

అంత్యక్రియలు చేసేందుకు ఆమెను పాడెపై గ్రామ శివారులోని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శ్మశానవాటికలో విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయాన్ని గమనించకపోవడంతో పాడెకు విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో పాడె మోస్తున్న రవీంద్రన్, తిరుపతి, మునప్ప అనే ముగ్గురు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందారు.

Shamshabad : ఇల్లు ఖాళీ చేయించారనే కక్షతో.. వృద్ధురాలితోపాటు చిన్నారిని హత్య చేసిన వ్యక్తి

మరొకరు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్దారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.