Tigers at kapila theertham : కపిలతీర్థంలో చిరుతల సంచారం

వెంకన్న భక్తులకు మరోసారి చిరుత భయం పట్టుకుంది. తిరుమల గిరుల్లో అప్పుడప్పుడు కనిపించే చిరుతలు ఇప్పుడు కొండ దిగి తిరుపతి పరిసర ప్రాంతాల్లోనూ సంచరిస్తున్నాయి. పాక్షిక లాక్‌డౌన్‌ కారణంగా జనసంచారం తగ్గిపోవడంతో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి చిరుతలు.

Tigers at kapila theertham : కపిలతీర్థంలో చిరుతల సంచారం

Tigers At Kapila Theertham

Tigers at kapila theertham :  వెంకన్న భక్తులకు మరోసారి చిరుత భయం పట్టుకుంది. తిరుమల గిరుల్లో అప్పుడప్పుడు కనిపించే చిరుతలు ఇప్పుడు కొండ దిగి తిరుపతి పరిసర ప్రాంతాల్లోనూ సంచరిస్తున్నాయి. పాక్షిక లాక్‌డౌన్‌ కారణంగా జనసంచారం తగ్గిపోవడంతో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి చిరుతలు.

తిరుపతి కపిల తీర్థం ఆలయంలో చిరుతపులి పిల్లలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆలయంలో స్వేచ్ఛగా పరుగులు పెడుతున్నాయి. కర్ఫ్యూ నిబంధనలతో తిరుమలలో జనసంచారం తగ్గింది. భక్తులు లేక కపిలేశ్వర ఆలయం ఖాళీగా దర్శనమిస్తోంది. కపిలతీర్థం ప్రాంతాల్లో జనసంచారం తగ్గడంతో… జంతువుల సంచారం పెరిగింది. రోజూ సాయంత్రం 6 గంటలకు ఆలయం మూతపడుతుండడంతో అక్కడికి చిరుతపులి పిల్లలు వస్తున్నాయి.

గత గురువారం రాత్రి పదకొండున్నర సమయంలో చిరుత పిల్లలు ఆలయంలోకి ప్రవేశించాయి. శుక్రవారం ఉదయం వరకు అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ అడవిలోకి వెళ్లాయి. ఈ దృశ్యాలన్నీ ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
గతేడాది లాక్‌డౌన్‌ సందర్భంగా తిరుమలలో చాలా రోజుల పాటు దర్శనాలు నిలిపేశారు. అప్పుడు తిరుమల గిరుల్లో నుంచి రోడ్లపైకి వచ్చాయి చిరుతలు.

తిరుమలలో ఉన్న సీసీ కెమెరాల్లో పులల సంచారం రికార్డయ్యింది. మళ్లీ పాక్షిక లాక్‌డౌన్‌ పెట్టగానే అడవి నుంచి బయటకు వస్తున్నాయి పులులు. దీంతో స్ధానికంగా ఉండే ప్రజలు హడలిపోతున్నారు.కపిల తీర్ధం ఆలయం దాటి పులులు పట్టణంలోకి వస్తే పరిస్ధితి ఎలా ఉంటుందాఅని ప్రజలు హడలిపోతున్నారు.