Kurnool : విషాదం..ఇసుక తీస్తుండగా విరిగిపడ్డ మట్టిగడ్డలు. వ్యక్తి మృతి

ఇసుక ఆరు అడుగుల గోతిలో ఉండడంతో దానిని తీసి బయటకు పోస్తుండగా పైన ఉన్న మట్టిదిబ్బ విరిగి ఆ గోతిలో ఉన్న లక్ష్మీనారాయణపై పడింది. మట్టిదిబ్బ కూలడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి వచ్చి మట్టిని తీసి లక్ష్మీనారాయణను కాపాడే ప్రయత్నం చేశారు.

Kurnool : విషాదం..ఇసుక తీస్తుండగా విరిగిపడ్డ మట్టిగడ్డలు. వ్యక్తి మృతి

Kurnool

Kurnool : కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆరు అడుగుల లోతులో ఉన్న ఇసుకను తీస్తుండగా పైన ఉన్న మట్టిగడ్డ కూలిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని కంబాలదిన్నె గ్రామంలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే కంబాలదిన్నె గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే యువకుడు ఎద్దుల బండి తీసుకోని ఇసుక తెచ్చేందుకు సమీపంలోని నది వద్దకు వెళ్ళాడు.

ఇసుక ఆరు అడుగుల గోతిలో ఉండడంతో దానిని తీసి బయటకు పోస్తుండగా పైన ఉన్న మట్టిదిబ్బ విరిగి ఆ గోతిలో ఉన్న లక్ష్మీనారాయణపై పడింది. మట్టిదిబ్బ కూలడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి వచ్చి మట్టిని తీసి లక్ష్మీనారాయణను కాపాడే ప్రయత్నం చేశారు. బయటకు తీసి అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఉపిరి ఆడకపోవడంతో లక్ష్మీనారాయణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

తమ కళ్ళముందు నుంచి వెళ్లిన వ్యక్తి మృతి చెందటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు గ్రామస్తులు.

Read:Vasalamarri Village: దత్తత గ్రామానికి కేసీఆర్.. సర్పంచ్‌కు సీఎం ఫోన్!