TTD : గుడికో గోమాత, దేశ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు – టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో 500 శ్రీ వారి ఆలయాలు నిర్మిస్తామని, అంతేగాకుండా దేశ వ్యాప్తంగా ఆలయాల నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్యుల భక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

TTD : గుడికో గోమాత, దేశ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు – టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Ttd

TTD Board Meeting : తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో 500 శ్రీ వారి ఆలయాలు నిర్మిస్తామని, అంతేగాకుండా దేశ వ్యాప్తంగా ఆలయాల నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్యుల భక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 2021, జూన్ 19వ తేదీ శనివారం టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. గుడికో గోమాతా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఇతర రాష్ట్రాల్లో కూడా దీనిని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వచ్చందంగా ముందుకు వస్తే టీటీడీ తరపున గోవులను ఇవ్వడం జరుగుతుందన్నారు.

దేశ వ్యాప్తంగా ఆలయాలు : –
జమ్మూ కాశ్మీర్ లో 62 ఎకరాల్లో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. 18 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఉత్తర భారతదేశంలోనే శ్రీవారి ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. వచ్చే ఏడాదిలో వారణాసి, ముంబైలోనూ ఆలయాలు నిర్మిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గో ఆధారిత నైవేద్యం అనే బృహత్తర కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

ఉద్యోగుల రెగ్యులరైజ్ :-
సహజ వనరులతో పండించే వాటితో నైవేద్యం ఇస్తున్నట్లు, మే 01వ తేదీ నుంచి ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. దీనిని శాశ్వతంగా చేసేందుకు టీటీడీ ప్రయత్నిస్తోందన్నారు. అన్ని జిల్లాల రైతులతో సమావేశం ఏర్పాటు చేసి..ఆ రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చేందుకు టీటీడీ చూస్తుందన్నారు. దేవాలయాల పునరుద్ధరణ చేయడం జరుగుతుందన్నారు. హెచ్ డీపీపీ వారికి పుణ్యక్షేత్రాల భృతి భత్యం రూ. 500 ఇచ్చేవారని, ఇది సరిపోవడం లేదని చెప్పడంతో దీనిని రూ 700లకు పెంచాలని సమావేశం నిర్ణయం తీసుకుందన్నారు. తిరుమలలో పని చేసే ఉద్యోగులందరినీ ఏ విధంగా రెగ్యులరైజ్ చేయాలనే దానిపై పాలసీ డ్రాప్ట్ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. తిరుమల కొండపై అనధికారికంగా ఉన్న దుకాణాలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని సమావేశం నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.