Solar Plant : ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ప్రారంభం

ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. 139 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Solar Plant : ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ప్రారంభం

Solar Plant

solar plant at TTD Srivenkateshwara College : ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 139 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీటీడీ కళాశాలలో ఇప్పటి వరకు యూనిట్ విద్యుత్‌కు రూ. 11.50 చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్‌తో యూనిట్ ఖర్చు రూ. 3.33కు తగ్గిందన్నారు. మొత్తంగా కళాశాలపై విద్యుత్తు బిల్లుల భారం నెలకు రూ. లక్షకు పైగా తగ్గిందని వెల్లడించారు.

కళాశాల భవనాల పైకప్పును సోలార్ పవర్ ఉత్పత్తి చేసే సంస్థకు ఇచ్చామని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ నిర్వహణ మొత్తం ఆ సంస్థ చూసుకుంటుందని చెప్పారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోందన్నారు. 190 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను ఈ ప్లాంట్ నిరోధిస్తుందని తెలిపారు. కొన్ని వేల మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనం ఈ ప్లాంటుతో కల్గుతుందని వెల్లడించారు.

Woman Police Inspector: చెన్నై వరదల్లో మహిళా ఎస్సై.. స్పృహ కోల్పోయిన వ్యక్తిని భుజాలపై మోసుకెళ్తూ..

వెంకటేశ్వర కాలేజీ అడ్మిషన్లలో తెలుగువారికి కోటా లేకుండా పోయిందన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నిబంధనలు మార్చడంతో సీట్లన్నీ యూనివర్సిటీ ద్వారా భర్తీ అవుతున్నాయని తెలిపారు. గతంలో ఉన్న మాదిరిగా కళాశాల యాజమాన్యానికి సీట్లను రిజర్వ్ చేయమని కోరినట్లు పేర్కొన్నారు. తద్వారా ఢిల్లీలో ఉంటున్న తెలుగువారికి అడ్మిషన్ కల్పించడం సాధ్యపడుతుందన్నారు.

అయితే టీటీడీ కాలేజీకి అవకాశమిస్తే, మిగతా కాలేజీలు కూడా యాజమాన్య కోటా కావాలని పట్టుబడతాయంటూ ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారని గుర్తు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పడిపోకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారని పేర్కొన్నారు. ఏదేమైనా తెలుగు విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు తాము కృషి చేస్తామన్నారు.

AP High Court : స్థానిక సంస్థాగత ఎన్నికల్లో ఎస్ఈసీ తీరును తప్పుబట్టిన ఏపీ హైకోర్టు

వెంకటేశ్వర కళాశాల ర్యాంకింగ్ గతం కంటే చాలా మెరుగుపడిందన్నారు. పరిశోధనల్లోనూ కాలేజీ చాలా చురుకుగా వ్యవహరిస్తోందని కొనియాడారు. సోలార్ ప్లాంట్ కారణంగా ఆదా అయ్యే విద్యుత్తు బిల్లు సొమ్మును ప్రత్యేకంగా దాచిపెట్టమని చెప్పినట్లు తెలిపారు. ఆ నిధులతో కాలేజీ హాస్టల్ భవంతులపై సొంతంగా పవర్ ప్లాంట్ పెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.