Tirumala Pakistan Currency : తిరుమల హుండీలో పాకిస్తాన్ కరెన్సీ అవాస్తవం, దర్శనాల సంఖ్య పెంచే ఆలోచన లేదు

టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని ఆయన అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైనట్టు రిపోర్ట్స్ ఉన్నాయన్నారు. శ్రీవారి హుండీలో పాకిస్తాన్ కరెన్సీ కూడా ఉందన్న వార్తలపై ఈవో స్పందించారు.

Tirumala Pakistan Currency : తిరుమల హుండీలో పాకిస్తాన్ కరెన్సీ అవాస్తవం, దర్శనాల సంఖ్య పెంచే ఆలోచన లేదు

Tirumala Pakistan Currency

Tirumala Pakistan Currency : టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని ఆయన అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైనట్టు రిపోర్ట్స్ ఉన్నాయన్నారు. ప్రస్తుతానికి దర్శనాలు సంఖ్య పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రాబోయే నెలల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శ్రీవారి హుండీలో పాకిస్తాన్ కరెన్సీ కూడా వచ్చిందన్న వార్తలపై ఈవో స్పందించారు. పాకిస్తాన్ కరెన్సీ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

తిరుమల శ్రీవారి అభిషేక సేవకు, నైవేద్యాలకు, దీపారాధనకు స్వచ్ఛమైన దేశవాళి ఆవు నెయ్యి ఉపయోగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో తెలిపారు. తిరుమలలోనే దేశీయ ఆవు నెయ్యి తయారు చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి దర్శన్ వారి సహకారంతో టీటీడీ సొంతంగా తయారు చేసే అగరబత్తీల విక్రయం ప్రారంభమవుతుందని ఈవో చెప్పారు. స్వామివారికి వినియోగించే పూలమాలలు, స్థానిక ఆలయాల్లో మూలవర్లకు వినియోగించిన పుష్పాలతో అగరబత్తీల తయారీకి టీటీడీ శ్రీకారం చుట్టిందన్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలోని ప్రధాన సర్కిళ్లలో చక్కటి ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తిరుమలలో పలు అభివృద్ధి పనులను ఈవో పరిశీలించారు.

ఇటీవల శ్రీవారి హుండీలో కరెన్సీ నోట్ల గురించి ఓ వార్త వచ్చింది. ఆ వార్త ప్రకారం ప్రపంచంలో మొత్తం 195 దేశాలు ఉండగా శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ ఉందని తెలిసింది. మలేషియా కరెన్సీ నోట్లు అత్యధికంగా 46 శాతం వచ్చాయని చెప్పారు. మలేషియా కరెన్సీ తర్వాతి స్థానంలో అమెరికా డాలర్లు ఉంటున్నాయని సమాచారం. శ్రీవారి హుండీలో అమెరికా డాలర్లు 16 శాతం ఉన్నట్లుగా గతంలో టీటీడీ వెల్లడించింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే శ్రీవారికి వచ్చిన విదేశీ కరెన్సీలో పాకిస్తాన్ నోట్లు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. శ్రీవారి హుండీలో పాకిస్తాన్ కరెన్సీ ఉందన్న వార్త వైరల్ అయ్యింది.