Tirumala Huge Rush : తిరుమలలో భక్తుల రద్దీని కంట్రోల్ చేసేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు.. దర్శనంలో మార్పులు, ఇకపై రూమ్ బుక్ అయితేనే ఎంట్రీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తెల్లవారుజామున కొనసాగే వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని మార్చాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం మార్పు చేస్తామని ప్రకటించారు ఈవో ధర్మారెడ్డి. అటు గదుల కేటాయింపు కౌంటర్ కూడా తిరుపతిలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు టీటీడీ ఈవో.

Tirumala Huge Rush : తిరుమలలో భక్తుల రద్దీని కంట్రోల్ చేసేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు.. దర్శనంలో మార్పులు, ఇకపై రూమ్ బుక్ అయితేనే ఎంట్రీ

Tirumala Huge Rush : తిరుమల భక్తజన సంద్రంగా మారింది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండపై ఇసుకేస్తే రాలనంత మంది ఉన్నారు. అనూహ్యంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

తెల్లవారుజామున కొనసాగే వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని మార్చాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం మార్పు చేస్తామని ప్రకటించారు ఈవో ధర్మారెడ్డి. అటు గదుల కేటాయింపు కౌంటర్ కూడా తిరుపతిలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు టీటీడీ ఈవో. రూమ్ బుక్ అయితేనే భక్తులు తిరుమలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తుండగా, భక్తుల ఇబ్బందులు తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఈవో ధర్మారెడ్డి.

నాలుగు రోజులుగా తిరుమలలో విపరీతమైన రద్దీ నెలకొనడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి రెండు రోజుల సమయం పడుతోంది. దీంతో భక్తుల రద్దీని కంట్రోల్ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇప్పటివరకు ఉదయం 6 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. దాన్ని ఉదయం 10 గంటలకు మార్చాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనిపై పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీన్ని అమలు చేయనున్నారు. ముందు రోజు వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉండిపోతారు. ఆ భక్తులను ఉదయాన్నే.. శ్రీవారి సేవలు అయ్యాక.. స్వామి వారి దర్శనానికి అనుమతించినట్లు అయితే వారు త్వరగా వెళ్లిపోవడానికి వీలు కలుగుతుంది.

ఇప్పటివరకు తిరుమలలోనే గదుల కేటాయింపు జరుగుతోంది. ఇకపై గదుల కేటాయింపు తిరుమలలో కాకుండా తిరుపతిలోనే చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ వెల్లడించింది. మొత్తంగా తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించడానికి టీటీడీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. గదులు దొరకని భక్తులు తిరుమలలో ఇబ్బందులు పడుతున్నారు, అదే తిరుపతిలో గదుల కేటాయింపులు జరిగినట్లు అయితే.. గదులు దొరక్కపోతే.. తిరుపతిలోనే ప్రైవేట్ హోటల్స్ లో భక్తులు ఆశ్రయించే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది. ఈ క్రమంలోనే గదుల కేటాయింపు తిరుమల నుంచి తిరుపతికి మార్చబోతున్నట్లు టీటీడీ తెలిపింది.