Ishtakaameswari Devi Secret Temple : నుదుట బొట్టి కోరితే చాలు .. కోర్కెలు తీర్చే ఇష్టకామేశ్వరి .. శ్రీశైలం దట్టమైన అడవిలో కొలువైన అమ్మవారు

నుదుట బొట్టి కోరితే చాలు .. కోర్కెలు తీర్చే ఇష్టకామేశ్వరి రహస్య దేవాలయం శ్రీశైలం నల్లమల దట్టమైన అడవిలో కొలువై గిరిజనులతో పూజలందుకుంటోంది.

Ishtakaameswari Devi Secret Temple : నుదుట బొట్టి కోరితే చాలు .. కోర్కెలు తీర్చే ఇష్టకామేశ్వరి .. శ్రీశైలం దట్టమైన అడవిలో కొలువైన అమ్మవారు

ishtakaameswari devi

Ishtakaameswari Devi Secret Temple : శ్రీశైలంలో ఓ రహస్య ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో మహిమ గల ఓ అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందట. అమ్మవారి నుదురు మనిషి నుదురులా మెత్తగా ఉండడం మరో విశేషం. పురాణ ఇతిహాసాల్లో శ్రీశైలం క్షేత్ర మహత్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో విశేషమైనది. ఉత్తర భారతదేశంలో ఉజ్జయినీ, కాశీ క్షేత్రాల తరువాత దక్షిణ భారతదేశంలో శ్రీశైలం క్షేత్రంలో మాత్రమే అన్ని సాంప్రదాయాల్లో ఆరాధనలు జరుగుతాయి. ఇక్కడ లేని ఆరాధన విధానమంటూ లేదంటూ ఎటువంటి అతిశయోక్తి లేదు.

శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న, భ్రమరాంబిక మాతల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో రహస్య దేవాలయాలు దాగి ఉన్నాయి. నల్లమల అడవుల్లో 500 శివలింగ క్షేత్రాలు ఉన్నట్లు చెబుతారు స్థానికులు. కానీ అక్కడికి చేరుకోవడం చాలా చాలా కష్టం. ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇక్కడి ప్రాచీన ఆలయాలను అన్వేషించే సాహసం ఎవ్వరూ చేయరు.ఒకప్పుడు కేవలం ఇక్కడి పర్వత ప్రాంతంపై ఉండే గూడెం ప్రజలు మాత్రమే మల్లన్నను దర్శించుకునే వారు. పల్లవులు, విజయనగరరాజులు తదితరుల పాలనలో ఈ క్షేత్రం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఇష్టకామేశ్వరి దేవి ఆలయం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కన్నా మరో ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరిదేవి దర్శనం చేసుకోలేరు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలు అయినా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టుపెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా, ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది. భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు. అమ్మవారు తమ కోరికలు తీరుస్తుంది అనటానికి ఇదే నిదర్శనమంటారు.

పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటున్నారు. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. పరమశివుడు, పార్వతి దేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు.

Madhaveswari devi : దాక్షాయణి అమ్మవారి కుడిచేతి వేళ్ళు పడిన పుణ్యక్షేత్రం .. శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం.

ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది. రెండు చేతులతో తామర మొగ్గలను, మరో రెండు చేతుల్లో ఓ చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లు దర్శనమిస్తారు అమ్మవారు. ఓ గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. ఇక్కడ జీవించే చెంచులు అమ్మవారిని కొలుచుకుంటుంటారు.

శ్రీశైలం కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంటుంది. ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది. ఎటువంటి కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి.

శ్రీశైలం వద్ద ప్రయాణికులతో జీపు నిండిన తరువాత మాత్రమే వాహనం బయలుదేరుతుంది. అత్యంత అనుభవం ఉన్న డ్రైవర్లు మాత్రం ఈ దారిన వాహనాన్ని నడుపగలరు. డోర్నాల్ మార్గంలో దాదాపు 12 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత ఓ అటవీ మార్గం కనిపిస్తుంది. అక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతితో జీపులు లోపలికి వెళతాయి. ఈ అడవిలో సౌకర్యవంతమైన రోడ్డు మార్గం లేకపోవడంతో దారిలో ఉండే అనేక బండరాళ్లను దాటుకుని జీపు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో జీపు పల్టీ కొడుతుందేమో అన్న భయం కూడా కలుగుతుంది.

Kamakhya Devi : జననాంగాన్ని పూజించే ఆలయం .. నెలలో మూడుసార్లు ఋతుస్రావం జరిగే కామాఖ్యదేవి పుణ్యక్షేత్రం

మార్గ మధ్యంలో జంతువుల అరుపులు భయాన్ని కలిగిస్తుంటే అదే జయంలో జలపాతాల సవ్వళ్లు మైమరిపిస్తాయి. ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో జీపులను నిలిపి వేస్తారు. జీపు నుంచి కింది దిగే ప్రయాణికులు అక్కడి ప్రకృతి అందాలను చూసి తమ కష్టాన్ని మరచిపోతారు. అటవీ మార్గంలో ఒక కిలోమీటరు నడక తరువాత పర్యాటకులకు చెంచు ప్రజల గూడాల మధ్య అమ్మవారి ఆలయం కనిపిస్తుంది.

రాత్రి సమయంలో ఈ అటవీ మార్గంలో మృగాలు సంచరిస్తుంటాయి. అందుకే సాయంత్రం 5 దాటిన తరువాత అడవిలోకి జీపులను అనుమతించరు. కోరిన కోర్కెలు తీర్చే ఎంతో మహిమ గల ఈ రహస్య ఆలయాన్ని శ్రీశైలం వెళ్లే పర్యాటకులు తప్పక దర్శించాలి. కానీ ఆ అదృష్టం అందరికి ఉండదంటారు.