Dengue Vaccine: డెంగ్యూ వ్యాక్సిన్.. త్వరలో భారత్‌లోకి!

కరోనా కష్టకాలం కాస్త తగ్గినట్లే కనిపిస్తున్నా కూడా వైరల్ జ్వరాలు ఇప్పుడు విజృంభిస్తున్నట్లు చెబుతున్నారు డాక్టర్లు.

Dengue Vaccine: డెంగ్యూ వ్యాక్సిన్.. త్వరలో భారత్‌లోకి!

Vaccine

Dengue Vaccine: కరోనా కష్టకాలం కాస్త తగ్గినట్లే కనిపిస్తున్నా కూడా వైరల్ జ్వరాలు ఇప్పుడు విజృంభిస్తున్నట్లు చెబుతున్నారు డాక్టర్లు. అప్రమత్తంగా ఉండకపోతే, ప్రాణాలను హరించే డెంగ్యూ జ్వరంకి వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. జపాన్‌కు చెందిన తకేడా ఫార్మా అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్ భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ)తో సంప్రదింపులు చేసిన తర్వాత.. సానుకూల స్పందన లభిస్తే వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని తకేడా ఫార్మా చెబుతుంది. డెంగ్యూ టెట్రావాలెంట్‌ లైవ్‌ అటెన్యుయేటెడ్‌ టీకా(టక్‌-003)ను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. తకేడా ఫార్మా పలు ఐరోపా దేశాల్లో దరఖాస్తు చేసుకోగా.. అదే సమయంలో వివిధ ఆసియా దేశాల్లో వ్యాక్సిన్ విక్రయానికి ప్రయత్నాలు చేస్తుంది.

తకేడా ఫార్మా ప్రపంచవ్యాప్తంగా 20 పెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటిగా నిలవగా.. క్యాన్సర్‌, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ వంటి అరుదైన వ్యాధులకు ఈ సంస్థ మెడిసిన్ తయారుచేసింది. డెంగ్యూ వ్యాక్సిన్‌ను కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది.

సనోఫీ ముందడుగు సనోఫీ అనే సంస్థ ‘డెంగ్‌వాగ్జియా’ అనే పేరుతో వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. దీనికి సింగపూర్‌, మెక్సికో, ఫిలిప్పీన్స్‌, పరాగ్వే, బ్రెజిల్‌, ఎల్‌సాల్వడార్‌, ఇండోనేసియాతో సహా 10 దేశాలు అనుమతి ఇచ్చాయి. గతేడాది జనవరిలో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ కూడా సనోఫీ వ్యాక్సిన్‌కి అనుమతి ఇచ్చింది. మన దేశంలో మాత్రం ఈ వ్యాక్సిన్‌కి ఇంకా అనుమతి లభించలేదు.