వల్లభనేని వంశీ బీజేపీతో టచ్‌లోనే ఉన్నారు : విష్ణువర్ధన్‌రెడ్డి
టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ తమతో టచ్‌లోనే ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.

టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ తమతో టచ్‌లోనే ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.
టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ తమతో టచ్‌లోనే ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. 13 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వంశీని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇంకా చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వంశీతో పాటు చాలా మంది నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. అయితే టీడీపీ, వైసీపీ తమ పార్టీలో చేరేవారిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీలో చేరే వారి లిస్ట్‌ను సరైన సమయంలో బయటపెట్టడమే కాదు.. వారందర్నీ పార్టీలో చేర్చుకుంటామన్నారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు చంద్రబాబు ధోరణి ఉందన్నారు. చంద్రబాబు, అతని కొడుకు లోకేశ్ వల్లే వంశీ టీడీపీకి రాజీనామా చేశారని చెప్పారు. వంశీకి బీజేపీలోని అనేక మందితో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయని తెలిపారు. సుజనా చౌదరితో భేటీ సమయంలో పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు సమాచారం