Andhra Minister Goutham Reddy : మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల వెంకయ్యనాయుడు సంతాపం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాస్మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

AP IT Minister Goutham Reddy
Andhra Minister Goutham Reddy : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాస్మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులన్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్దత కలిగిన నాయకులని కొనియాడారు.
గౌతమ్ రెడ్డి తాత గారి సమయం నుంచి వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. ‘‘గౌతమ్ రెడ్డి నేనంటే ఎంతో అభిమానం చూపేవారు…అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం’’ అని ఆవేదన చెందారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సానుభూతి తెలియజేశారు.
గౌతమ్‌రెడ్డి మృతి పట్ల కేశినేని నాని తీవ్ర దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్(నాని)తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. గౌతంరెడ్డి సౌమ్యుడు, స్నేహశీలి అని ఆయన హఠాస్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి, కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని , సానుభూతిని తెలియచేసి, మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కేశినేనినాని విడుదల చేసిన సంతాపం సందేసంలో పేర్కోన్నారు.
Also Read : AP : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత
జేసీ అస్మిత్ రెడ్డి సంతాపం
నిన్న రాత్రి వివాహ వేడుకలో మాతో కలిసి ఆనందంగా గడిపిన గౌతమ్ రెడ్డి గారు నేడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నానని అనంతపురం తాడిపత్రికి చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి కుమారుడు జెసి అస్మిత్ రెడ్డి అన్నారు.