TDP : విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటన.. టీడీపీ ఎదురుదాడి

టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. వైసీపీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంది.

TDP : విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటన.. టీడీపీ ఎదురుదాడి

Tdp

TDP : లైంగిక వేధింపులు తాళలేక విజయవాడలో 9వ తరగతి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. దీనిపై రాజకీయ దుమారం రేగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పాత ఘటనలను తెరపైకి తెస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు టీడీపీ, వైసీపీ నాయకులు.

బాలిక ఆత్మహత్యకు టీడీపీ నేత కారణం అంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి వైసీపీ శ్రేణులు. చంద్రబాబుని టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. బాలిక మృతికి చంద్రబాబు, నారా లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాలికలు, మహిళలపై టీడీపీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోయిందని విమర్శలు చేస్తున్నారు.

Lemon Tea : లెమన్ టీ తాగితే ఎక్కవకాలం జీవించవచ్చా?…

దీనిపై టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. బాలిక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని టీడీపీ నేతలు తెలిపారు. మరి వైసీపీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ఎదురుదాడి
ప్రారంభించింది టీడీపీ. రేపు ఉదయం మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో మహిళలపై దాడులకు నిరసనగా తెలుగు మహిళలు నారీ దీక్ష చేపట్టనున్నారు.

విజయవాడ నగరంలోని భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో నివాసం ఉంటున్న బాలిక.. బెంజి సర్కిల్‌ వద్ద గల ఓ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. తనను ఓ వ్యక్తి కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని నోట్ బుక్‎లో రాసిన బాలిక.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యకు ముందు టెర్రస్‌పై 20 నిమిషాల పాటు బాలిక అటూ ఇటూ తిరగడం సీసీ టీవీ కెమెరాల్లో కనిపించిందని పోలీసులు తెలిపారు. నిందితుడు వినోద్ జైన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలల నుంచి బాలికను వినోద్ జైన్ వేధిస్తున్నాడని… పలు సార్లు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతడి వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. బాలిక సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు వినోద్ పై పోక్సో కేసు నమోదు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ… వినోద్ జైన్ పై చర్యలు తీసుకుంది. అతడిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది.

Over Weight : అధిక బరువుకు ఆయుర్వేదంతో చెక్

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 37 డివిజన్ కు చెందిన వినోద్ కుమార్ జైన్.. అనైతిక చర్యలకు పాల్పడినట్టుగా ఆరోపణలు రావడంతో పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు వినోద్ జైన్.

మరోవైపు బాలిక తల్లిదండ్రులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. వినోద్ జైన్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసినా.. టీడీపీపై విమర్శలు ఆగలేదు. వినోద్ జైన్ తనను ఎలా ఇబ్బంది పెట్టాడో ఆ బాలిక మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిందని మంత్రి వెల్లడించారు. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోదని, బాలిక ఆత్మహత్యపై చంద్రబాబు సమాధానం చెప్పాలని మంత్రి వెల్లంపల్లి డిమాండ్ చేశారు.

అసలు, అంత వయసున్న వ్యక్తికి ఈ బుద్ధి ఎలా వచ్చిందో అని మంత్రి అన్నారు. ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని, వినోద్ జైన్ ను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వినోద్ జైన్ ఎంపీ కేశినేని నానికి ముఖ్య అనుచరుడు అని, ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అతడి కోసం చంద్రబాబు కూడా ప్రచారం చేశాడని వెల్లంపల్లి ఆరోపించారు. ఇలాంటి నీచులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

ఆత్మహత్యకి ముందు బాలిక తన నోట్ బుక్ లో మూడు పేజీల లేఖ రాసింది. ఆ తర్వాత అపార్ట్ మెంట్ టెర్రస్ పై అటు ఇటూ తిరిగింది. చివరికి టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకొంది. బాలిక టెర్రస్ పై ఉన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.