Tirupati : తిరుపతిలో విశాఖ యాత్రికుడు ఆత్మహత్యాయత్నం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం  చేసుకున్నాడు.

Tirupati : తిరుపతిలో విశాఖ యాత్రికుడు ఆత్మహత్యాయత్నం

Tpt Suicide

Updated On : December 12, 2021 / 10:03 PM IST

Tirupati :  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం  చేసుకున్నాడు. విశాఖపట్నంకు చెందిన అరవింద్ దంపతులు ఈనెల 7వ తేదీన రైల్వే స్టేషన్ సమీపంలోని కరణాల వీధిలోని వైభవ్ రెసిడెన్సీలో రూమ్ నెంబర్ 211 లో బస చేశారు.

తిరుమల దర్శనానికి వెళ్లి…మూడు రోజుల తర్వాత అరవింద్ ఒక్కడే మళ్లీ వచ్చి రూమ్ నెంబర్ 104 లో తిరిగి బస చేశాడు. ఆదివారం ఉదయం కత్తితో చేయి కోసుకుని అపస్మారక స్ధితిలో పడి ఉన్నాడు.
Also Read : Gone Prakash Rao : గోనె ప్రకాష్‌‌రావు‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం
అతడ్ని గమనించిన హోటల్ సిబ్బంది వెంటనే రూయా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్   పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.