Vundavalli Sridevi: అక్రమ మైనింగ్‌కు అడ్డుగా ఉన్నందుకే నాపై కుట్ర.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: ఉండవల్లి శ్రీదేవి

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమైందో.. నా పరిస్థితి కూడా అలాగే అవుతుందని హైదరాబాద్ వచ్చా. చాలా ప్రీ ప్లాన్డ్‌గా నాపై కుట్ర జరిగింది. మూడు సంవత్సరాలనుంచి నన్ను వాడుకున్నారు. నా నియోజకవర్గ ప్రాంతంలో ఇసుక మాఫియా దోచుకుంది. వాళ్ళ దందాలకు నేనెక్కడ అడ్డం వస్తానో అని నాపై కక్ష గట్టారు.

Vundavalli Sridevi: అక్రమ మైనింగ్‌కు అడ్డుగా ఉన్నందుకే నాపై కుట్ర.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: ఉండవల్లి శ్రీదేవి

Vundavalli Sridevi: అక్రమ మైనింగ్, భూ దందాలకు అడ్డుగా ఉన్నందుకే తనపై కుట్ర పన్నారని, పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే కారణంతో ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నుంచి ఆమె కనిపించలేదు.

ISRO: ఎల్‌వీఎమ్3 రాకెట్ ప్రయోగం విజయవంతం.. 36 ఉపగ్రహాలతో దూసుకెళ్లిన రాకెట్

దీంతో శ్రీదేవి ఎక్కడ ఉన్నారు అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె హైదరాబాద్‌లో మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘గత మూడు రోజుల నుంచి నన్ను కొన్ని మీడియా చానెల్స్, సోషల్ మీడియాలో వేధిస్తున్నారు. శ్రీదేవి ఎక్కడా అని వార్తలు వేస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. వాళ్లకు అక్కచెల్లెళ్ళు లేరా? నేను టెర్రరిస్టునా, మాఫియా డాన్‌నా? నేను చేసిన తప్పేంటి? నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. హైదరాబాద్ ఏమైనా సహారా ఎడారా? నా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమైందో.. నా పరిస్థితి కూడా అలాగే అవుతుందని హైదరాబాద్ వచ్చా. చాలా ప్రీ ప్లాన్డ్‌గా నాపై కుట్ర జరిగింది. మూడు సంవత్సరాలనుంచి నన్ను వాడుకున్నారు. నా నియోజకవర్గ ప్రాంతంలో ఇసుక మాఫియా దోచుకుంది. వాళ్ళ దందాలకు నేనెక్కడ అడ్డం వస్తానో అని నాపై కక్ష గట్టారు. అసలు ఏమైందో తెలియకుండానే నాపై ఆరోపణలు చేస్తున్నారు.

PM Modi: మోదీ పర్యటనలో భద్రతాలోపం.. కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన వ్యక్తి.. వైరల్ వీడియో

కొన్ని రోజుల ముందే నేను, నా కూతురు సీఎం జగన్‌ను కలిశాం. తాను అండగా ఉంటాను అని చెప్పారు. సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలో నేను క్రాస్ ఓటింగ్ చేశానని ఎలా చెప్తున్నారు. వోటింగ్ టేబుల్ కింద ఏమన్నా పెట్టారా.. ఎవరన్న ఉన్నారా? ఒక పథకం ప్రకారం నా మీద నింద మోపారు. గూండాలతో నా కార్యాలయంపై దాడి చేయించారు. అసలు ఎమ్మెల్సీ జీతం ఎంత, దానికి ఓటు వేయడానికి కోట్లు, అంత డబ్బులు ఇస్తారా? నేను, నా భర్త డాక్టర్లం. మాకు 2 హాస్పిటల్స్ ఉన్నాయి. నేను ప్రజా సేవ చేయొచ్చని రాజకీయాలలోకి వచ్చాను. అది భ్రమ అని ఇప్పుడు అర్థం అయ్యింది.

Viral Video: ఏనుగుల గుంపు హాయిగా ఎలా నిద్రపోతుందో చూశారా.. ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో

కుక్కకు పిచ్చి పట్టిందని నింద మోపి కొట్టి చంపిన్నట్లు నన్ను ట్రీట్ చేస్తున్నారు. అమరావతి ఇక్కడే ఉంటుందా అని నన్ను ప్రతి ఒక్కరు అడిగారు. జగనన్న ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పాను. పాపం అమరావతి రైతులు అన్ని రోజులుగా పోరాటం చేస్తుంటే నేను ఏం చేయలేకపోయా. జగన్ కనీసం అమరావతిని అభివృద్ధి చేశారా? అమరావతిలో ఒక్క ఇటుక తీసి ఇటుక పెట్టారా? ఎస్సీలంటే చులకన. నేను ఆంద్రప్రదేశ్ వెళ్లాలంటే భయమేస్తోంది. నా ప్రాణాన్ని పణంగా పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకున్నాను. ఇంత విలువలేని రాజకీయాలుంటాయా! బంగారుపళ్ళెంలో పెట్టి సస్పెన్షన్ బహుమతి ఇచ్చారు.

అమరావతి రైతుల కోసం నేను వస్తున్నా. నా ప్రాణం పోయినా అమరావతి కోసం పోరాడతా. మా అమ్మాయి ఢిల్లీలో చదువుతోంది.. ఆమెను మీ రాజధాని ఏంటని అడుగుతున్నారట. నేను ఇప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యేను. వైసీపీ గుండాలు నా ఆఫీసు పై దాడి చేసి విధ్వంసం చేశారు. నాకు సజ్జల నుంచి ప్రాణ హాని ఉంది. నేను జాతీయ ఎస్సీ కమిషన్‌కు పిర్యాదు చేస్తా. నాకు ఎలాంటి హాని లేదన్న నమ్మకం వచ్చాకనే ఆంధ్రప్రదేశ్ వస్తాను. ఒక ఎమ్మెల్యేకు రక్షణ లేని ఆంధ్రప్రదేశ్‌లో ఉండలేను. మీకు దమ్ముంటే ఆ గుండాలను అరికట్టండి. మంచి రిటర్న్ గిఫ్ట్ త్వరలోనే ఇస్తా. జగన్ కొట్టిన దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయ్యింది.

నేను ఏ పార్టీలో చేరేది ఇప్పుడు చెప్పలేను. వాళ్ళు చేసే దందాలకు నేను అడ్డుగా ఉన్నానని నా పై కుట్ర పన్నారు. జగన్‌కు కేవలం చెవులే ఉంటాయి. జగన్ మంచి వ్యక్తి. ఆయన పక్కన ఉన్నవారు నాపై కుట్ర చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులను డబ్బులు ఇచ్చి రాయించుకుంటున్నారు. నేను ఏ తప్పు చేయలేదని ఎక్కడైనా ప్రమాణం చేస్తాను’’ అని శ్రీదేవి వ్యాఖ్యానించారు.