PM Modi: మోదీ పర్యటనలో భద్రతాలోపం.. కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన వ్యక్తి.. వైరల్ వీడియో

మోదీ కాన్వాయ్ వైపు ఒక యువకుడు దూసుకొచ్చాడు. దూరంగా బారికెడ్లు ఏర్పాటు చేసి, చుట్టూ పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ, వాటిని దాటుకుని అతడు మోదీ వైపు దూసుకెళ్లాడు. చాలా దగ్గరకు రాగానే గుర్తించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు.

PM Modi: మోదీ పర్యటనలో భద్రతాలోపం.. కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన వ్యక్తి.. వైరల్ వీడియో

Updated On : March 26, 2023 / 8:08 AM IST

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతాలోపం బయటపడింది. శనివారం మోదీ కర్ణాటకలోని దేవనగరెలో పర్యటించారు. ఈ సందర్భంగా భద్రతా లోపం బయటపడటం ఆందోళన కలిగించింది. మోదీ అక్కడ రోడ్ షో నిర్వహించారు. అయితే, మోదీ కాన్వాయ్ వైపు ఒక యువకుడు దూసుకొచ్చాడు.

Tirumala Leopard : తిరుమలలో చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు

దూరంగా బారికెడ్లు ఏర్పాటు చేసి, చుట్టూ పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ, వాటిని దాటుకుని అతడు మోదీ వైపు దూసుకెళ్లాడు. చాలా దగ్గరకు రాగానే గుర్తించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అతడిని పట్టుకుని దూరంగా లాక్కెళ్లారు. ఈ దృశ్యాన్ని అక్కడి వాళ్లెవరో వీడియో తీశారు. తాజాగా ప్రధాని వైపు దూసుకెళ్లిన వ్యక్తిని కొప్పల్ జిల్లాకు చెందిన యువకుడిగా గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా మోదీ పర్యటనలో భారీ భద్రత ఉంటుంది. బారికెడ్లను దాటుకుని ఎవరూ రాకుండా చూసుకుంటారు. అయితే, ఇలా సెక్యూరిటీని దాటి యువకుడు దూసుకెళ్లడం భద్రతాలోపాన్ని బయటపెట్టింది.

అంతకుముందు కర్ణాటకలోని హుబ్బలి జిల్లాలో కూడా ఇలాగే మోదీ పర్యటనలో మరో భద్రతాలోపం కనబడింది. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే అక్కడ మోదీ ప్రచార కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండగా, మరోసారి అధికారం సొంతం చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో తిరిగి తమకు అధికారం అప్పగించాలని మోదీ ప్రజలను కోరుతున్నారు.