ISRO: ఎల్‌వీఎమ్3 రాకెట్ ప్రయోగం విజయవంతం.. 36 ఉపగ్రహాలతో దూసుకెళ్లిన రాకెట్

ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఏపీలోని, శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది. ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా ఒకేసారి 36 ఉపగ్రహాల్ని అంతరిక్షంలో ప్రవేశపెడతారు. ఈ రాకెట్ పొడవు 43.5 మీటర్లు, వెడల్పు 4.4 మీటర్లు, బరువు 543 టన్నులు.

ISRO: ఎల్‌వీఎమ్3 రాకెట్ ప్రయోగం విజయవంతం.. 36 ఉపగ్రహాలతో దూసుకెళ్లిన రాకెట్

ISRO: ఇస్రో ప్రయోగించిన ఎల్‌వీఎమ్3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఏపీలోని, శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది. ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా ఒకేసారి 36 ఉపగ్రహాల్ని అంతరిక్షంలో ప్రవేశపెడతారు.

PM Modi: మోదీ పర్యటనలో భద్రతాలోపం.. కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన వ్యక్తి.. వైరల్ వీడియో

ఈ రాకెట్ పొడవు 43.5 మీటర్లు, వెడల్పు 4.4 మీటర్లు, బరువు 543 టన్నులు. ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి వన్‌వెబ్ సంస్థతో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 72 ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలి. మొదటి దశలో 36 ఉపగ్రహాల్ని గత అక్టోబర్ 23న ప్రయోగించారు. ఆదివారం మరో 36 ఉపగ్రహాల్ని ప్రయోగించారు. ఇవి ప్రైవేటు సంస్థకు చెందిన ఉపగ్రహాలు. అందువల్ల వీటిని అంతరిక్షంలో ప్రవేశపెట్టడం ద్వారా సంస్థకు రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరింది. ఇస్రో చేపట్టిన రెండో వాణిజ్య ఉపగ్రహ ప్రయోగమిది. తాజాగా అంతరిక్షంలో ప్రవేశపెట్టిన 36 ఉపగ్రహాల బరువు 5,805 కిలోలు. 19.7 నిమిషాల్లోనే 36 ఉపగ్రహాలు లియో ఎర్త్ కక్ష్యలోకి చేరుకున్నాయి.

Indian Journalist: అమెరికాలో భారతీయ జర్నలిస్టుపై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి

కాగా, రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ ప్రకటించారు. నిర్దేశిత కక్ష్యలోకి జీఎస్ఎల్‌వీ మార్క్-3 రాకెట్ ప్రవేశం పూర్తైనట్లు చెప్పారు. ‘‘ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తైంది. ఇస్రో సిబ్బంది సమష్టి కృషివల్లే ఇది సాధ్యమైంది. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రవేశపెడతాం. దీనికి సంబంధించి పని జరుగుతోంది. మార్క్-3 రాకెట్ ద్వారా మరిన్ని వాణిజ్య ప్రయోగాలు చేస్తాం. జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్‌ను మరింత అభివృద్ధి చేస్తాం’’ అని డా.సోమనాథ్ వెల్లడించారు.