Indian Journalist: అమెరికాలో భారతీయ జర్నలిస్టుపై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి
అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం వద్ద లలిత్ ఝా అనే భారతీయ జర్నలిస్టుపై శనివారం దాడి చేశారు. ఖలిస్తాన్ మద్దతుదారులు అక్కడి రాయబార కార్యాలయం వద్ద శనివారం ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిపై సమాచారం సేకరించేందుకు లలిత్ ఝా అక్కడి వెళ్లాడు.

Indian Journalist: ఖలిస్తాన్ మద్దతుదారులు అమెరికాలోనూ ఆందోళన, విధ్వంసానికి దిగుతున్నారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లలో రాయబార కార్యాలయాలపై దాడులు చేసిన ఖలిస్తాన్ మద్దతుదారులు తాజాగా భారతీయ జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు.
PM Modi: మోదీ పర్యటనలో భద్రతాలోపం.. కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన వ్యక్తి.. వైరల్ వీడియో
అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం వద్ద లలిత్ ఝా అనే భారతీయ జర్నలిస్టుపై శనివారం దాడి చేశారు. ఖలిస్తాన్ మద్దతుదారులు అక్కడి రాయబార కార్యాలయం వద్ద శనివారం ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిపై సమాచారం సేకరించేందుకు లలిత్ ఝా అక్కడి వెళ్లాడు. వాళ్ల ఆందోళనను రిపోర్ట్ చేస్తుండగా, కొందరు ఖలిస్తాన్ మద్దతుదారులు అతడిపై దాడి చేశారు. తన ఎడమ చెవిపై రెండు కర్రలతో కొట్టారని, అంతేకాకుండా తనను దూషించారని లలిత్ ఝా వెల్లడించారు. అయితే, అయనను అక్కడున్న అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాపాడారు. లలిత్ ఝా తన డ్యూటీ చేసేందుకు వాళ్లు సహకరించారు.
ఈ సందర్భంగా వారికి లలిత్ ఝా ధన్యవాదాలు తెలిపారు. తనను వాళ్లు రక్షించకపోతే ఆస్పత్రిపాలయ్యే వాడినని లలిత్ అన్నాడు. కాగా, ఇటీవలి కాలంలో ఖలిస్తాన్‌కు అనుకూలంగా అమెరికా, బ్రిటన్‌లో ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఇటీవల పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ సింగ్ కోసం వేట మొదలుపెట్టడాన్ని వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పంజాబ్ పోలీసుల చర్యకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఖలిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.