Weather Forecast For Andhra Pradesh : ఏపీలో రాగల 3 రోజులు భారీ వర్షాలు

రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Weather Forecast For Andhra Pradesh : ఏపీలో రాగల 3 రోజులు భారీ వర్షాలు

Rains in Telangana

Weather Forecast For Andhra Pradesh :  ఆంధ్రప్రదేశ లో ఈరోజు, రేపు, ఎల్లుండి వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్యభారత దేశం వైపు ప్రయాణించింది.. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. ఈ కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది రేపటికి మరింత బలపడనుంది. దీని ఫలితంగా ఈ నెల 21, 22 ,23 తేదీల్లో  కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

శనివారం ,ఆగస్టు 21 నాడు విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకటి- రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కోంది. ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు
మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఆదివారం (ఆగస్టు 22) కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా
వేసింది. దక్షిణ కోస్తాంధ్రలో.. శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తాంధ్రాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

రాయలసీమలో.. శనివారం (ఆగస్టు 21) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం (ఆగస్టు 22) ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంటుందని చెప్పింది.