విధ్వంసం, దుందుడుకుతనం : వైసీపీ ఆరు నెలల పాలనపై పవన్ ట్వీట్

  • Published By: madhu ,Published On : November 23, 2019 / 02:09 AM IST
విధ్వంసం, దుందుడుకుతనం : వైసీపీ ఆరు నెలల పాలనపై పవన్ ట్వీట్

వైసీపీ పాలనపై జనసేనానీ మండిపడ్డారు. విధ్వంసం, దుందుడుకుతనం, కక్ష సాధింపు అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మానసిక ఆవేదన, అనిశ్చితి, విచ్చిన్నం అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం వరుస ట్వీట్ చేశారు పవన్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలను ఆయన ఒక్కోటిగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. మొత్తం ఆరు పోస్టర్లలో ఆయన విమర్శలు చేశారు. 

1. విధ్వంసం : కూల్చివేత పర్వాలు, ఉద్దేశ్యపూర్వకంగా వరదనీటితో రాజకీయాలు, కార్మికుల ఆత్మహత్యలు, 
2. దుందుడుకుతనం : పోలవరం కాంట్రాక్టు రద్దు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు, అమరావతి నిర్మాణం నిలుపుదల, జపాన్ రాయబారి – సింగపూర్ ప్రభుత్వాల నిరసనలు, ఆర్బిట్రేషన్లు. 
3. కక్ష సాధింపుతనం : శ్రీకాకుళంలోని సామాన్య కార్యకర్తతో మొదలుకొని, పోలీసు వేధింపులు, జనసేన ఎమ్మెల్యే రాపాక మీద కేసులు బనాయించడం, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ ఉరి వేసుకోవడం, ప్రత్యర్థుల బత్తాయి చెట్లు నరికివేయడం, చానెల్స్ బ్యాన్ చేయడం, జర్నలలిస్టులకీ, చట్టాల ముసుగులో సంకెళ్లు వేయడం, దుర్గి మండలంలో ఊళ్లు ఊళ్లు మగాళ్లు లేకుండా ఖాళీ చేయడం, వారికి ఓటు వేయ్యని ప్రజలను బెదిరించడం, భయపెట్టడం, రహదార్లు మూసేయ్యడం, సోషల్ మీడియాలో ఎవరు ఒక మాట అన్నా కేసులు పెట్టి వేధించడం, ఊళ్లల్లో భయానక వాతావరణం సృష్టించడం…
4. మానసిక వేదన : విలేజ్ వాలంటీర్ల అని 5 లక్షల ఉద్యోగాలు అనౌన్స్ చేసి 2 లక్షల 89 వేల ఉద్యోగాలు మాత్రమే నింపి, 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పోగొట్టారు. 27 లక్షల భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్లిపోయారు. ప్రభుత్వ విధానం వల్ల లక్షా 65 వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగుల భవిష్యత్ గాలిలో, 90 వేలు పైచిలుకు ఉన్న తెలుగు టీచర్లను, ఆంగ్ల మాధ్యమం పేరు మీద ఆంగ్లం రాకపోతే..వారి స్థానంలో విలేజ్ వాలంటీర్స్ లాగా కొత్తవారిని పెట్టుకుంటారనే భయాలు, స్థానిక వ్యాపార వేత్తలని పార్టీలనీ, వేరే కులాలని వేధింపులు, వారు పొరుగు రాష్ట్రాలకి వెళ్లిపోవడం, పెట్టుబడులు ఆంధ్రకి ఇంక రావు, తద్వారా ఉద్యోగ అవకాశాలు ఉండవు. నిరుద్యోగులు నిస్సహాయత, ఇలా అనేకం…
5. అనిశ్చితి : ఇన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టిన అమరావతి రాజధాని ఉంటుందా ? కేంద్రం ఏపికి నిధులు ఇస్తుందా ? నవరత్నాలకు నిధులు ఉన్నాయా ? ప్రభుత్వ ఉద్యోగుల నెల జీతభత్యాలకు డబ్బులున్నాయా ? 40 వేల కోట్లు ఉన్న అప్పు, పెట్టుబడులు లేవు పెట్టినవి పంపేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటీ ? 
6. విచ్ఛిన్నం : ఆంగ్ల భాష బోధన అన్న వాదనతో తెలుగు భాషని, సంస్కృతిని, భారతీయ సనాతన ధర్మం విచ్ఛిన్నతికి శ్రీకారం చుట్టారు. 151 అసెంబ్లీ సీట్లు ఉన్న వైసీపీ హానికర ధోరణిని ఇకనైనా ఆపాలని కోరుకుందాం’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. 
Read More :ఇంగ్లీష్ మీడియంపై వ్యాఖ్యలు : సీఎం జగన్ కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు వివరణ