Chandrababu Early Elections : ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్- చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో అప్పుడే ఎన్నికల హడావుడి(Chandrababu Early Elections) మొదలైంది. ముందస్తు ఎన్నికల గురించి హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో..

Chandrababu Early Elections : ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్- చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Early Elections

Chandrababu Early Elections : ఏపీలో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. ముందస్తు ఎన్నికల గురించి హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారా? అంటే.. అవుననే అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల గురించి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నారని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకత ఇంకా పెరగవచ్చన్న ఉద్దేశంతో ముందస్తు ఎన్నికల యోచన చేస్తున్నారని ఆయన వివరించారు. అయితే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. నెత్తిమీద కుంపటిని దించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.

Chandrababu On Elections : ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైసీపీ ఓటమి ఖాయం-చంద్రబాబు

సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు చంద్రబాబు. జగన్ పక్కా క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మేన్ అని విమర్శించారు. అమ్మఒడి విషయంలో మాట తప్పారని, మడమ తిప్పారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. దిశం చట్టం అని ప్రచారం చేశారని, కానీ దానికి ఇంతవరకు చట్టబద్ధత లేదని అన్నారు. తాము నిర్మించిన పోలీస్ స్టేషన్లకు రంగులు వేసి దిశ పీఎస్ లు అంటూ హడావుడి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు.. రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తాడా? అని సీఎం జగన్ ని ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. జగనన్న బాణాన్ని అంటూ.. ఊరూ వాడా తిప్పారు.. ఇప్పుడు ఆ బాణం హైదరాబాద్ లో ఉండిపోయింది అని చంద్రబాబు అన్నారు. మాజీమంత్రి వైఎస్
వివేకానందరెడ్డి హత్య విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. బాబాయ్ హత్య విషయమై సీఎం జగన్ తన చెల్లికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సీఎం జగన్ క్షమాపణ చెప్పకుంటే ప్రజలు క్షమించరని చంద్రబాబు హెచ్చరించారు.

మహిళా దినోత్సవం చేయడానికి సీఎం జగన్ కు అర్హత లేదన్నారు చంద్రబాబు. సీఎం జగన్ ఇచ్చేది గోరంత.. దోచేది కొండంత అని ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో ఆదాయాలు తగ్గుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయని చంద్రబాబు వాపోయారు. చెత్త మీద పన్ను వేసే ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం అంటారని చంద్రబాబు అన్నారు. మహిళల జుట్టు మీద కూడా పన్నేసేలా ఉన్నారని విమర్శించారు. సీఎం జగన్ సత్య హరిశ్ చంద్రుడిలా ఫోజులిస్తున్నారని విమర్శించారు. సత్యహరిశ్ చంద్రుడు పోతూ పోతూ ఆ స్థానంలో తనను పెట్టారన్న రీతిలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Brother Anil Kumar: ‘కొత్త పార్టీ పెట్టే ఆలోచనే లేదు’

మద్య నిషేధం అన్నారు.. మద్యంలో కొత్త బ్రాండ్లు తెచ్చారని అన్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25ఏళ్లు తాకట్టు పెట్టడం ద్వారా.. పాటికేళ్ల పాటు మద్య నిషేధం ఉండదని చెప్పకనే చెప్పేశారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం.. ఐటీ ఉద్యోగాలిస్తే.. వైసీపీ ప్రభుత్వం చికెన్, మటన్ షాపుల్లో
ఉద్యోగాలిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ అబద్దాల కోరు అన్న చంద్రబాబు.. జగన్ ఆడిన అబద్దాలపై పుస్తకం వేస్తున్నాం అని తెలిపారు. అమ్మ ఒడి ద్వారా కొంత మేర ఇచ్చి.. నాన్న బుడ్డి ద్వారా మరెంతో లాగేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు.