Chandrababu On Elections : ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైసీపీ ఓటమి ఖాయం-చంద్రబాబు

నెత్తి మీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చంద్రబాబు(Chandrababu On Elections) అన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఈ ప్రభుత్వాన్ని..

Chandrababu On Elections : ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైసీపీ ఓటమి ఖాయం-చంద్రబాబు

Chandrababu On Elections

Chandrababu On Elections : ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఛాన్స్ చిక్కితే చాలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు.. రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తాడా? అని సీఎం జగన్ ని ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. జగనన్న బాణాన్ని అంటూ.. ఊరూ వాడా తిప్పారు.. ఇప్పుడు ఆ బాణం హైదరాబాద్ లో ఉండిపోయింది అని చంద్రబాబు అన్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. బాబాయ్ హత్య విషయమై సీఎం జగన్ తన చెల్లికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సీఎం జగన్ క్షమాపణ చెప్పకుంటే ప్రజలు క్షమించరని చంద్రబాబు హెచ్చరించారు.

హత్యలు చేసే వాళ్లు సీఎంగా ఉండాలా..? హత్యలు చేసే వాళ్లు మంత్రులుగా ఉండాలా..? అని చంద్రబాబు నిలదీశారు. బాబాయ్ హత్యను నేనే చేయించాను అని సిగ్గు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమ్మఒడి విషయంలో జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు సేఫ్టీనే లేదన్నారు చంద్రబాబు. దిశా చట్టం అన్నారు.. కానీ దానికి ఇప్పటివరకు చట్టబద్దత లేదన్నారు. నేను కట్టిన పోలీస్ స్టేషన్ కు రంగులేసి.. దిశ పోలీస్ స్టేషన్ అంటూ హడావుడి చేశారని చంద్రబాబు విమర్శించారు.

BAC Meeting : టీడీపీ సభ్యులు గవర్నర్ వయస్సుకు కూడా గౌరవం ఇవ్వలేదు-సీఎం జగన్

ఎన్నికలు, ఎన్నికల ఫలితాలపైనా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెత్తి మీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఎన్నికలు (Chandrababu On Elections) ఎప్పుడు పెట్టినా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయం అని జోస్యం చెప్పారు. సీఎం జగన్ పక్కా క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ ఎంత సంపాదించామో అని గల్లా పెట్టె చూసుకుంటూ ఉంటారని అన్నారు. మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వైసీపీ పనిగా పెట్టుకుందని చంద్రబాబు ఆరోపించారు. అసెంబ్లీలో నా భార్యను కించపరిచారని చంద్రబాబు వాపోయారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానీ.. ఇప్పుడు కానీ భువనేశ్వరి ఎప్పుడైనా రాజకీయాల్లో కన్పించారా..? అని చంద్రబాబు అడిగారు.

టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు ఇళ్లు ఇస్తే.. జగన్ వచ్చి ఓటీఎస్ ఇచ్చి ఎదురు డబ్బులు వసూలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ గతంలో ఇచ్చిన ఇళ్లకు కూడా ఓటీఎస్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓటీఎస్ వసూళ్లకు ఎవరైనా వస్తే.. కట్టేదే లేదని చెప్పేయండి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిలో ఆడబిడ్డల టాయిలెట్ల పైకి డ్రోన్లు పంపించి వేధించారని చంద్రబాబు ఆరోపించారు.

మహిళా దినోత్సవం చేయడానికి సీఎం జగన్ కు అర్హత లేదన్నారు చంద్రబాబు. సీఎం జగన్ ఇచ్చేది గోరంత.. దోచేది కొండంత అని ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో ఆదాయాలు తగ్గుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయని చంద్రబాబు వాపోయారు. చెత్త మీద పన్ను వేసే ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం అంటారని చంద్రబాబు అన్నారు. మహిళల జుట్టు మీద కూడా పన్నేసేలా ఉన్నారని విమర్శించారు. సీఎం జగన్ సత్య హరిశ్ చంద్రుడిలా ఫోజులిస్తున్నారని విమర్శించారు. సత్యహరిశ్ చంద్రుడు పోతూ పోతూ ఆ స్థానంలో తనను పెట్టారన్న రీతిలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Brother Anil Kumar: ‘కొత్త పార్టీ పెట్టే ఆలోచనే లేదు’

మద్య నిషేధం అన్నారు.. మద్యంలో కొత్త బ్రాండ్లు తెచ్చారని అన్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25ఏళ్లు తాకట్టు పెట్టడం ద్వారా.. పాటికేళ్ల పాటు మద్య నిషేధం ఉండదని చెప్పకనే చెప్పేశారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం.. ఐటీ ఉద్యోగాలిస్తే.. వైసీపీ ప్రభుత్వం చికెన్, మటన్ షాపుల్లో ఉద్యోగాలిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ అబద్దాల కోరు అన్న చంద్రబాబు.. జగన్ ఆడిన అబద్దాలపై పుస్తకం వేస్తున్నాం అని తెలిపారు. అమ్మ ఒడి ద్వారా కొంత మేర ఇచ్చి.. నాన్న బుడ్డి ద్వారా మరెంతో లాగేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు.