YS Viveka’s Murder: సునీల్ యాదవ్‌కు నార్కో అనాలసిస్.. వివేకా కేసు విచారణ వాయిదా!

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

YS Viveka’s Murder: సునీల్ యాదవ్‌కు నార్కో అనాలసిస్.. వివేకా కేసు విచారణ వాయిదా!

Viveka (1)

YS Viveka’s Murder: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తుండగా.. పులివెందుల ఆర్‌ అండ్‌ బీ వసతి గృహంలో పలువురిని విచారణకు పిలిచారు సీబీఐ అధికారులు. మరోవైపు సునీల్‌కు నార్కో అనాలసిస్‌ పరీక్షలపై జమ్మలమడుగు కోర్టులో విచారణ ఆగస్ట్ 27వ తేదీకి వాయిదా పడింది. సునీల్‌ను నార్కో పరీక్షలకు అనుమతివ్వాలంటూ సీబీఐ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలైంది.

అయితే, పులివెందుల కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో పిటిషన్ జమ్మలమడుగు కోర్టుకు బదిలీ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ(18 ఆగస్ట్ 2021) జమ్మలమడుగు కోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. సునీల్ కుమార్ తరపు న్యాయవాది హితేష్ కుమార్, సీబీఐ అధికారుల వాదనలు విన్న కోర్టు 27వ తేదీకి విచారణను వాయిదా వేసింది. అప్పటివరకు సునీల్ యాదవ్‌ను రిమాండ్‌లో ఉంచనున్నారు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్‌ను విచారణకు హాజరుపరిచే అవకాశం ఉంది.

మరోవైపు సీబీఐ అధికారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు వివేకా కుమార్తె సునీత రెడ్డి. సీబీఐ విచారణకు సునీల్ సహకరించలేదని సీబీఐ అధికారులు ఆమెకు చెప్పారు. నార్కో అనాలిస్‌ టెస్ట్ చేస్తేనే నిజాలు బయటకు వస్తాయని అంటున్నారు. హత్యలో ఎవరెవరి హస్తముంది. ఎందుకు చంపారు..? హత్యకు ఎన్నిరోజుల ముందు స్కెచ్‌ గీశారు. వివేకాను చంపడానికి కారణాలేంటి? అనే విషయాలు నార్కో అనాలిసిస్ టెస్టులోనే తేలుతాయని అంటున్నారు సీబీఐ అధికారులు. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు.