Home » Author »bheemraj
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం నేరంగా భావించే ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం అసమంజసంగా ఉందని తీర్పు వెల్లడించింది. ఈ మేరకు జస్టిస్ షాహిద్ కరీం (Justice Shahid Karim) దేశ ద్రోహానికి సంబంధించిన పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124Aను హైకోర్టు కొట్�
చిలీలో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ చిలీ తీరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ సీస్మోలజీ వెల్లడించింది.
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. యూఎస్ ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో 9 మంది అమెరికన్ సైనికులు దుర్మరణం చెందారు.
అమెరికాలో హష్ మనీ చెల్లింపుల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హష్ మనీ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై నేరాభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ట్రంప్ పై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరి నేరాభియోగాలు మోపింది.
చిలీలో బర్డ్ ఫ్లూ (Bird Flu) వైరస్ కలకలం రేపుతోంది. మనిషిలో (Human) బర్డ్ ఫ్లూ(Bird Flu) లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్(ఈడీ) రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎమ్మెల్యే కేసు నమోదు చేశారు. 16.8 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2 లక్షల కోట్లతో కూడిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన విజ్ఞాపనలతో జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు విజ్ఞాపనలను కేంద్రానికి అందజేశార�
టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక మ్యానుపులేటర్ అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను దేవుడే రక్షించాలని చెప్పారు.
కియా పరిశ్రమ ముందు ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఒక్క కియా పరిశ్రమతో 25 వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? అని ప్రశ్నించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లో శ్రీరాముని శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. శ్రీ రాముని శోభాయాత్రకు పోలీలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేట్ వద్ద ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున దురంతో ఎక్స్ ప్రెస్ రైలు బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం నుజ్జునుజ్జు అయింది.
లోక్ సభ సభ్యత్వం రద్దు తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి పార్లమెంట్ లో ప్రత్యక్షమయ్యారు. సీపీపీ కార్యాలయంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు.
దక్షిణాది అయోధ్యగా పేరు పొందిన ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
దసరా పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులపై చార్జిషీట్ దాఖలు చేసింది. ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదుల పాత్రను ఎన్ఐఏ చార్జిషీట్ లో పేర్కొంది.
పేపర్ లీకేజీ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ AEE పరీక్ష రద్దు చేసింది. గత సెప్టెంబర్ 3న AEE పరీక్ష జరిగింది. ఏఈఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేసిన కేంద్రం, ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ ను గౌరవించటం అంటే దేశాన్ని గౌరవించటమేనని పేర్కొన్నారు.
తాను ఒక్క అడుగు భూమినైనా ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు తన నిజాయితీకి భంగం కలిగించే వార్తలు ప్రచురిస్తున్నాయని పేర్కొన్నారు.