Helicopters Crash : అమెరికాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. 9 మంది సైనికులు మృతి

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. యూఎస్ ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో 9 మంది అమెరికన్ సైనికులు దుర్మరణం చెందారు.

Helicopters Crash : అమెరికాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. 9 మంది సైనికులు మృతి

helicopters crash

Updated On : March 31, 2023 / 10:08 AM IST

Helicopters Crash : అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. యూఎస్ ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు కుప్పకూలాయి. కెంటెల్లీ రాష్ట్రంలోని ట్రిక్ కౌంటీలో పోర్ట్ క్యాంపెల్ డెల్ ప్రాంతంలో కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో 9 మంది అమెరికన్ సైనికులు దుర్మరణం చెందారు.

శిక్షణలో భాగంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. అమెరికా సైన్యంలో 101 ఎయిర్ బోన్ డివిజన్ కు చెందిన రెండు హెచ్ హెచ్ 60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లలో సైనికులు శిక్షణ పొందుతుండగా అకస్మాత్తుగా రెండు హెలికాప్టర్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు.

Helicopter Crashes Near Kedarnath: కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురి మృతి

ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై కెంటకీ గవర్నర్‌ ఆండీ బెషీర్ ట్వీట్ చేశారు. ప్రమాదం జగిన ప్రదేశంలో పోలీసులు, సహాయ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పోర్ట్ క్యాంబెల్ లోని అమెరికా సైన్యానికి చెందిన 101ఎయిర్ బోర్నే డివిజన్ బేస్ క్యాంప్ ఉంది.

1942 ఆగస్టులో ఈ డివిజన్ ను అమెరికన్ సైన్యం ఏర్పాటు చేసింది. దీనిని ట్రిని ఈగల్స్ అని కూడా పిలుస్తారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో డీజే లారీ, బ్యాటిల్ ఆఫ్ ది బల్గేగా ఈ డివిజన్ ను పిలిచేవారు.