Home » Author »bheemraj
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరిని సిట్ అరెస్టు చేసింది. షాద్ నగర్ పరిధిలోని నేరేళ్లచెరువుకు చెందిన రాజేంద్రకుమార్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పేపర్ లీకేజీ కేసులో అరెస్టు అయిన నిందితుల సంఖ్య 14కు చేరింది.
తెలుగు రాష్టాలకు రెండో వందేభారత్ రైలు రానుంది. ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విశాఖపట్నానికి వందేభారత్ రైలు నడుస్తోంది. త్వరలోనే సికింద్రబాద్ - తిరుపతి మార్గంలో మరో రైలు రాబోతుంది.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ జరుగనుంది. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో నాందేడ్ జిల్లాలోని కంధార్ లోహాలో జరుగబోయే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడోల ధాటికి మొత్తం 26 మంది చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు అదృశ్యమయ్యారు.
జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చని.. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నది అనుమానమేనని టీడీపీ నారా లోకేష్ అన్నారు. ఎమెల్సీ ఎన్నికల్లో తమకు వైసీపీ వాళ్ళే ఓట్లు వేశారని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకే పార్టీలో దిక్కులేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. లోక్ సభ సెక్రటేరియట్ విధించిన అనర్హత వేటుపై మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ స్పందించిన తీరును తప్పుబట్టారు.
నంద్యాల జిల్లా డీఈఓ అనురాధ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. 8 మంది ప్రభుత్వ టీచర్లను పోలీసు స్టేషన్ లో ఉంచాలంటూ డీఈఓ ఉత్తర్వులు ఇచ్చారు.
మనీశ్ సిసోడియా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది.
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరొకరు ఆరెస్ట్ అయ్యారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేట్ ఉపాధి హామీ (ఈసీ) అధికారి ప్రశాంత్ సిట్ అరెస్ట్ చేసింది. పేపర్ కొనుగోలు చేసి ప్రశాంత్ పరీక్ష రాశారు.
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాహుల్ నోరు నొక్కేసే ఉద్ధేశంతో ప్రభుత్వం మెరుపు వేగంతో వ్యవహరించి అనర్హత వేటు వేసిందని ఆరోపిస్తున్నారు.
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచింది. ఉద్యోగులందరికీ 4 శాతం కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం ఎనిమిది రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 42 గంటల 12 నిమిషాలపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. మొత్తం 27 బిల్లులకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్ లోని కింగ్ కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉన్న వినాయక్ కారు మెకానిక్ షెడ్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
దేశం(India)లో కృత్రిమ మాంసం రాబోతుంది. మాంసానికి ప్రత్యామ్నాయంగా ల్యాబ్ గ్రోన్ మీట్(Lab Grown Meat)(కృత్రిమ మాంసం)కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రంగంలో స్టార్టప్ లకు మంచి భవిష్యత్తు ఉండనుంది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 1,249 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,249 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి.
లోక్ సభ(Lok Sabha)లో ఫైనాన్స్ బిల్లు-2023(Finance Bill-2023)కు ఆమోదం లభించింది. 45 సవరణలతో ఫైనాన్స్ బిల్లును ఆమోదించింది.
పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో సిట్(SIT) ముమ్మర దర్యాప్తు చేస్తోంది.
జపాన్ లో స్వల్ప భూకంపం సంభవించింది. ఇజు ద్వీపంలో శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది.
ఝార్ఖండ్ (Jharkhand) లోని ధన్ బాద్(Dhanbad)నగరంలో విమాన ప్రమాదం జరిగింది. ఓ చిన్నపాటి విమానం(Glider Plane)అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా 14 ఏళ్ల బాలుడికి గాయాలయ్యాయి.