Finance Bill-2023 : ఫైనాన్స్ బిల్లు-2023కు లోక్ సభ ఆమోదం

లోక్ సభ(Lok Sabha)లో ఫైనాన్స్ బిల్లు-2023(Finance Bill-2023)కు ఆమోదం లభించింది. 45 సవరణలతో ఫైనాన్స్ బిల్లును ఆమోదించింది.

Finance Bill-2023 : ఫైనాన్స్ బిల్లు-2023కు లోక్ సభ ఆమోదం

Lok Sabha

Updated On : March 24, 2023 / 2:43 PM IST

Finance Bill-2023 : లోక్ సభ(Lok Sabha)లో ఫైనాన్స్ బిల్లు-2023(Finance Bill-2023)కు ఆమోదం లభించింది. 45 సవరణలతో ఫైనాన్స్ బిల్లును ఆమోదించింది. అదానీ అంశంపై జేపీసీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా కేంద్రం ఫైనాన్స్ బిల్లును పాస్ చేసింది. శుక్రవారం మార్చి24న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) లోక్ సభలో ఫైనాన్స్ ఫైనాన్స్ బిల్లు-2023ను ప్రవేశపెట్టారు.

ఉద్యోగుల అవసరాలను పరిష్కరించడానికి, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ అంశాన్ని పరిశీలించేందుకు ఆర్థిక కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఆర్ బీఐ(RBI) నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రతిపాదనలు అందాయని సీతారామన్ చెప్పారు.

Union Budget 2023-24 : కేంద్ర బడ్జెట్ 2023-24.. మహిళలకు ప్రత్యేక పథకం

ఫైనాన్స్ బిల్లు 2023ను లోక్‌సభలో పరిశీలన మరియు ఆమోదం కోసం ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ విదేశీ పర్యటనల కోసం క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు సంబంధించిన సమస్యలను లిబరలైజ్డ్ రెమిటెన్సెస్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద స్వాధీనం చేసుకోకుండా ఆర్‌బిఐ పరిశీలిస్తుందని మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు 64 అధికారిక సవరణలతో ఫైనాన్స్ బిల్లును నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.ఫైనాన్స్ బిల్లు-2023 బిల్లు పాసైన తర్వాత లోక్ సభ వాయిదా పడింది.

#Budget2023: కేంద్ర బడ్జెట్-2023లోని 7 లక్ష్యాలు.. సప్తర్షిగా వర్ణించిన ఆర్థికమంత్రి నిర్మల

ఇక బిల్ పేరు వింటేనే వివిధ రకాల ఖర్చులు గుర్తుకు వస్తాయి. 1వ తేదీతో ఖర్చులు మొదలవుతాయి.  కిరాణం మొదలు కొని పాలు, పేపర్ వరకు ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్ లో ఓ బిల్లు తీసుకొస్తుంది. ఈ బిల్లు ద్వారా సంవత్సరం మొత్తం ప్రజల నుంచి వివిధ రకాల పన్నులు వసూలు చేస్తారు. అదే ఫైనాన్స్ బిల్లు. పార్లమెంట్ లో బిల్లు ప్రస్తావన వస్తే చట్టం గురించి చర్చ జరుగుతోందని భావించాలి. బడ్జెట్ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంటుంది.

ఆర్థిక సర్వే రిపోర్టు బడ్జెట్ లో ప్రవేశ పెట్టినప్పుడు అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రభుత్వం వివిధ రకాల ఖర్చులను వివరిస్తుంది. ఈ ఖర్చులకు నిధులు సమీకరణ కోసం ఫైనాన్స్ బిల్లును తీసుకొస్తారు. ఫైనాన్స్ బిల్లులో నిధుల సర్ధుబాటుకు అవసరమైన చట్ట సవరణలకు ప్రతిపాదనలు ఉంటాయి. ప్రభుత్వ ఖర్చులను సర్దుబాటు చేసేందుకు చేసే చట్ట సవరణల బిల్లును ఫైనాన్స్ బిల్ అంటారు. ఫైనాన్స్ బిల్లును మనీ బిల్ అని కూడా పిలుస్తారు.