Home » Author »bheemraj
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వపై లోక్ సభలో జలశక్తి శాఖ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని కేంద్రం తేల్చి చెప్పింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) కేసుపై ఆరోపణలు చేసినందుకుగానూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్ లో వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటాను ఈ ముఠా చోరీ చేశారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలు కొట్టేసి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ(BJP) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్పు చేసింది. నాలుగు రాష్ట్రాలు బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశాకు నూతన అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.
టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. సిట్ అధికారుల విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇంటి దొంగల బాగోతం తవ్వేకొద్ది బయటపడుతోంది.
తెలంగాణలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించనున్నారు. ఇటీవల వడగళ్లతో కూడిన వానలు దంచికొట్టాయి. వరి, మొక్కజొన్నతోపాటు భారీ స్థాయిలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
విశాఖలో అర్ధరాత్రి విషాదం నెలకొంది. రామజోగిపేటలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల తీరుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం, మంత్రులను దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని అ
రాజస్థాన్ అజ్మీర్‌లోని ఓ ఉత్సవంలో డ్రాప్ టవర్ రైడ్ కుప్పకూలడంతో 11 మంది గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది.
టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు. టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ 4,411.68 కోట్లుగా పేర్కొన్నారు. హుండీ ద్వారా 1,591 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని అంచనా వేశారు.
ఢిల్లీలో పోస్టర్ల కలకలం రేగింది. మోదీ హాఠావో...దేశ్ బచావో పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. పేపర్ లీకేజీకి సంబంధించి నిరసన గళం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం రేప�
తీన్మార్ మల్లన్నను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల నడుమ మంగళవారం సాయంత్రం క్యూ న్యూస్ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ట్విస్టు వెలుగు చూసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. శంకర్ లక్మీతోపాటు మరో మహిళను సిట్ అధికారులు విచారించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపారు.
పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అక్కడ భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు బీటలు వారాయి.
సీల్డ్ కవర్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించంది. సీల్డ్ కవర్లపై ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఓపీ కేసు విచారణ సందర్భంగా ఇకపై సీల్డ్ కవర్లను ఆపేద్దామని వ్యాఖ్యానించింది.
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేయనున్నారు. మంగళవారం(మార్చి21)న సీఎం జగన్ తాడేపల్లి సీఎం కార్యాలయం నుండి వర్చువల్ గా రాగి జావ పంపిణీ ప్రారంభించనున్నారు.
జూనియర్ లెక్షరర్(జేఎల్) నియామక పరీక్ష ప్రశ్నాపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. జేఎల్ పేపర్-2 పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగులోనూ ఇవ్వాలని ఆదేశించింది. పేపర్-2 ఇంగ్లీష్ లోనే ఇవ్వాలన్న టీఎస్పీఎస్సీ నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది.