Home » Author »bheemraj
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విచారణకు హాజరయ్యారు. మహిళా కమిషన్ కు ఆయన వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ లో ప్రమాదం జరిగింది. వైర్ తెగి లిఫ్ట్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు గురయ్యారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్క రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో మూడు గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు
గుజరాత్ హైకోర్టులో ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. తన ప్రియురాలు తనను కాకుండా మరొకరిని పెళ్లిచేసుకుందన్న కోపంతో యువతిని ఆమె భర్త నుంచి కస్టడీలోకి తీసుకోవాలని యువకుడు పిటిషన్ దాఖలు చేశాడు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. యుక్రెయిన్ నుండి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం సహా యుద్ధ నేరాలకు అతను బాధ్యుడని కోర్టు ఆరోపించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి వరుసుగా నోటీసులు జారీ చేస్తోంది. తాజాగా మనీశ్ సిసోడియా సెక్రటరీ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది. మార్చి21న విచారణకు రావాలని అరవింద్ కుమార్ ను ఈడ�
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శనివారం(మార్చి18,2023) మొదటి భారత్ గౌరవ్ రైలు ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ రైలు ప్రారంభమవ్వనుంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కమిషన్ సభ్యులను మార్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. 9 మంది నిందితులకు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితులకు ఆరు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరగాల్సిన కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేసింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు బయటపడ్డాయి. పేపర్ లీక్ కేసుపై టీఎస్పీఎస్సీకి సిట్ నివేదిక ఇచ్చింది. పేపర్ లీక్‌లో కీలక సూత్రదారి రాజశేఖరే అని సిట్ తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీకి డిప్యుటేషన్‌పై రాజశేఖర్ వచ్చారని �
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కై 5 శాతం నుంచి 12% మార్జిన్ పెంచారని ఈడీ తెలిపింది. ఆధారాలు దొరక్కుండా డిజిటల్ ఫోన్లన్నీ ధ్వంసం చేశారని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకు ఈడీ కస్టడీ పొడిగించారు. రౌస్ అవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ పొడిగించింది. ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించడంతో మార్చి 22వ తేదీ వరకు మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు.
నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలై పోయిందని విమర్శించారు. కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనల్లో నిజం లేదని వెల్లడించారు. ఇక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని.. అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు.
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేస్తే జరిమానా తప్పదు. ఇటీవల అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటిని ఉల్లంఘించి చాలా మంది సందర్శకులు తమ వాహనాలను వంతెనపై నిలుపుతున్నారు. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కూడా వాహనా
సీఎం జగన్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన నాగరాజును ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ ను టీడీపీ నేత పట్టాభి రామ్ కుటుంబ సమేతంగా కలిశారు. ఏపీలో పరిస్థితులు, పోలీసులు తనపై జరిపిన దాడిపై ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు రాజీవ్ జైన్ ను కలిశారు.
స్టేషన్ ఘనపూర్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, తనపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరుణపురంలో ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకలలో పాల్గొన్న రాజయ్య కంటతడి పెట్టారు.