Home » Author »bheemraj
వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP)అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ మహిళ కమిషన్ ను కలిశారు. బీఆర్ఎస్ నేతలపై మహిళ కమిషన్ కు ఆమె ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమిషన్ ముందు ఉంచారు.
చలో రాజ్ భవన్ కి బయలుదేరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఖైరతాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఖైరతాబాద్ నుంచి గోషామాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ విచారణకు సంబంధించి తాత్కాలిక ఊరట ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన తెలిపారు. తనకు మైక్ ఇవ్వాలంటూ కోటంరెడ్డి నిరసనకు దిగారు. నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని ప్లకార్డు పట్టుకుని నిలబడి నిరసన తెలుపుతున్నారు.
ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏపీ వ్యాప్తంగా 1489 పరీక్షా కేంద్రాలు, తెలంగాణ వ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పోలీసులు 144 సెక్షన్ విధించారు.
ఉత్తరప్రదేశ్ లోని ఔరైయా జిల్లాలో వినూత్న వివాహం జరిగింది. ఓ యువతి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకున్నారు. ఆ యువతి శ్రీకృష్ణుడితో ఏడడుగులు నడిచింది. పూర్తి ఆచారాలతో శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకున్నారు.
మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ ఉండనుంది. మార్చి 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
తెలంగాణ మహిళా కమిషన్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లేఖ రాశారు. బుధవారం విచారణకు హాజరు కావాలన్న మహిళా కమిషన్ నోటీసులపై ఆయన రిప్లై ఇచ్చారు.
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరింది. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరడంతో అన్ని నియామక బోర్డులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలనేని శ్రీనివాస రెడ్డి కామెంట్స్ చేశారు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు ధౌర్జన్యం చేశారని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అంటున్నారని పేర్కొన్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై ఆ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి కన్నం అంజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పై పలు విమర్శలు చేశారు. బండి సంజయ్ దళితులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోంది.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో ఊహించని వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని చూసిన కొందరు అభిమానులు జై శ్రీరామ్ అంటూ అరిచారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంటలను అమ్ముకునే సమయంలో రైతులు దళారుల చేతిలో మోస పోకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చారు. విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ ప్రత్యేక యాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ ను సులువుగా తెలుసుకోవచ్చు.
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. పెరిగితే భారీగా పెరగడం తగ్గితే భారీగా తగ్గడం పసిడి ట్రెండ్ గా మారిపోయింది. గత వారం తరుగుదల నమోదు చేసిన బంగారం మళ్లీ నాలుగు రోజులుగా పెరుగుదల నమోదు చేస్తోంది.
మచిలీపట్నంలో మంగళవారం జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి వారాహి వాహనంలో ఈ సభకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న పవన్ ర్యాలీ సాయంత్రం 5 గంటల వరకు మచిలీపట్నంకు చేరుకోనుంది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. మంగళవారం విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున విచారణకు రాలేనని చెప్పారు.
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ వ్యవహారంలో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్ పీఎస్ సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ సహా 9 మందిని అరెస్టు చేశారు.